Virat Kohli: ఇక అంపైర్లు హాయిగా నిద్రపోతారులే – డివిలియర్స్

లీగ్ ప్రారంభానికి ముందే ఈ విషయాన్ని స్పష్టం చేసిన కోహ్లి ..మొన్న కోల్‌క‌తాతో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో చివరి మ్యాచ్ కూడా పూర్తయిపోయింది.

10TV Telugu News

Virat Kohli: ఐపీఎల్‌లో 9 సీజ‌న్ల పాటు రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన విరాట్ కోహ్లి ఈ సీజ‌న్‌తో త‌ప్పుకుంటున్నట్లు ప్రకటించేశాడు. లీగ్ ప్రారంభానికి ముందే ఈ విషయాన్ని స్పష్టం చేసిన కోహ్లి ..మొన్న కోల్‌క‌తాతో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో చివరి మ్యాచ్ కూడా పూర్తయిపోయింది. ఐపీఎల్ ట్రోఫీ అందించాల‌నే ఆశ నెర‌వేర‌కుండానే కెప్టెన్సీ ముగిసిపోయింది.

ఆ మ్యాచ్‌లో అంపైర్ వీరేందర్ శ‌ర్మ‌పై కోహ్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వీడియో వైర‌ల్‌ అయింది. స‌ద‌రు అంపైర్ ఆర్సీబీకి వ్య‌తిరేకంగా ఇచ్చిన కొన్ని నిర్ణ‌యాలు త‌ర్వాత రివ్యూలో రివ‌ర్స్ అయ్యాయి. అలా కోహ్లి వ్యక్తం చేసిన ఆగ్ర‌హానికి కారణముందని స్పష్టమైంది. ఈ విషయాన్ని ఇన్‌డైరక్ట్‌గా ప్ర‌స్తావించిన డివిలియర్స్… విరాట్‌పై సెటైర్ వేశాడు.

మ్యాచ్ త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తీసిన వీడియోలో కోహ్లి కెప్టెన్సీపై స్పందించిన ఏబీ.. స‌ర‌దాగా ఇలా అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో కొంత‌మంది అంపైర్లు హాయిగా నిద్ర‌పోతారు. అదే స‌మ‌యంలో కోహ్లిని ప్ర‌శంసిస్తూ గొప్ప కెప్టెన్సీ కెరీర్ పూర్తి చేసుకున్నందుకు కోహ్లికి శుభాకాంక్ష‌లు. ఇక స్వేచ్ఛ‌గా ఫీల్డ్‌లోకి వెళ్లి ఆడుతూ ఆర్సీబీకి తొలి ట్రోఫీని, ఇండియాకు మ‌రెన్నో ట్రోఫీలు అందించాలి అని అన్నాడు.

…………………………………………………: చూపులతోనే మత్తు జల్లేస్తున్న నేపాలీ బ్యూటీ