India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టిన జట్టును బీసీసీఐ సత్కరించనుంది.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మన అమ్మాయిలు అదరగొట్టారు. ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత యువ మహిళా ఆటగాళ్లు అద్భుతంగా రాణించి ప్రపంచ కప్ సాధించి పెట్టారు.

Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టిన జట్టును బీసీసీఐ సత్కరించనుంది. బుధవారం అహ్మదాబాద్‌లో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. స్థానిక నరేంద్ర మోదీ స్డేడియంలో, సాయంత్రం 06.30 గంటలకు ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. దీనికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Viral Video: కాయిన్స్ ఎగరేయడం నేర్చుకుంటున్న పిల్లి.. ఆకట్టుకుంటున్న వీడియో

సచిన్ చేతుల మీదుగా అండర్-19 మహిళా జట్టును సన్మానిస్తారు. ఈ సన్మాన కార్యక్రమంతో పాటు బీసీసీఐ ప్రపంచ కప్ విజేతలకు భారీ నజరానా ప్రకటించింది. మహిళల జట్టుకు రూ.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ టోర్నీ విజయంలో కెప్టెన్ షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా జట్టును విజయ పథంలో నడిపించింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత షెఫాలీ వర్మ మాట్లాడుతూ ఈ విజయం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింతగా రాణించాల్సి ఉందని ఆమె అన్నారు. రాబోయే సీనియర్ టీ20 మహిళల ప్రపంచ కప్‌లో కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.