ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్‌ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల సంగతేంటి?

ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్‌ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల   సంగతేంటి?

ఉప్పల్ వేదికగా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బయల్దేరిన ఆస్ట్రేలియా 2 టీ20లు, 5 వన్డేలు.. ఇప్పటికే టీ20 సిరీస్ విజయంతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతోంది. వన్డే ఫార్మాట్ కోసం సిద్ధమైన ఆసీస్ జట్టు టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేయగా ఇక వన్డేల్లోనూ అద్భుతంగా రాణించగలదని ఆశిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌లో జరగనున్న 2019 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టులో మార్పులు చేసుకునే దిశగా ప్రయత్నంలో ఉన్న కోహ్లీ వన్డే జట్టు కూర్పు ఎలా ఉండబోతుందననే ఆసక్తి నెలకొంది. విదేశీ పర్యటనల అనంతరం సొంతగడ్డపై జరిగిన టీ20 మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ దూకుడైన ఆటతీరు కనబరిచాడు. తొలి టీ20లో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, రెండో టీ20లో 26 బంతుల్లోనే 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతని స్థానంపై సందేహమేమీ లేనట్లు కనిపిస్తోంది. 
Read Also : అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు

రాహుల్ స్థానం పక్కా అయిపోవడంతో ఓపెనర్‌గా ధావన్.. రోహిత్‌లలో ఒక్కరినే దించనున్నట్లు తెలుస్తోంది. రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశమిస్తూ ప్రపంచ కప్ జట్టు కోసం సిద్ధం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాలుగో స్థానంలో అంబటి రాయుడు, కేదర్ జాదవ్ ఇద్దరిలో ఒక్కరికే అవకాశం దక్కనుండగా పంత్ 5, 6, 7 స్థానాలలో ఏదో ఒకదానికే ఆడనున్నారు.

బౌలింగ్ విభాగంలో చాహల్ ఫిక్స్ అయిపోగా, జడేజా, కుల్దీప్ లలో  ఒకరి మాత్రమే అవకాశం దక్కనుంది. ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ లు ఎవ్వరూ ఆశించనంత మేర రాణించకపోవడంతో వారి బదులు షమీని బరిలోకి దించడం ఉత్తమమని తెలుస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరోగ్యం కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉంటున్నాడు.  ఆ స్థానాన్ని విజయ్ శంకర్ భర్తీ చేస్తాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
Read Also : వెల్‌కమ్ అభినందన్, అప్పుడే అయిపోయిందనుకోవద్దు

భారత జట్టు(అంచనా):
శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, విజయ్ శంకర్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా జట్టు(అంచనా):
ఆరోన్ ఫించ్, డార్సీ షార్ట్, షాన్ మార్ష్, అలెక్స్ క్యారీ, పీటర్ హ్యాండ్స్ కాంబ్, రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, ఆండ్రూ టై, నాథన్ లయన్