US OPEN 2020 : Kobe Bryant జెర్సీ ధరించిన ఒసాకా

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 12:20 PM IST
US OPEN 2020 : Kobe Bryant జెర్సీ ధరించిన ఒసాకా

యూఎస్‌ ఓపెన్ టైటిల్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచిన జపాన్‌ ప్లేయర్ నవోమి ఒసాకా విలేకరుల సమావేశంలో దివంగత మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు Kobe Bryant జెర్సీ ధరించింది. కోబ్ బ్రయంట్ అనుకున్నది తాను సాధించాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఓ వ్యక్తి ఎందరికో స్పూర్తినివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాంటి వారిగా కావాలని అనుకుంటున్నట్లు, కానీ సమయమే నిర్ణయిస్తుందన్నారు.


us open

us open

పోలీసుల కాల్పులో మరణించిన నల్లజాతీయుడి పేరున్న మాస్క్‌లను మ్యాచ్‌ల సందర్భంగా నవోమి ధరిస్తున్న విషయం తెలిసిందే. తొలి రౌండ్‌లో బ్రియానా టేలర్, సెకండ్ రౌండ్‌లో ఎలిజా మెక్‌క్లెయిన్, మూడో రౌండ్‌లో అహ్‌మౌద్ ఆర్బెరీ, ట్రేవన్ మార్టిన్, క్వార్టర్స్‌లో జార్జ్ ఫ్లాయిడ్, సెమీఫైనల్లో ఫిలాండో క్యాస్టిల్, ఫైనల్లో టమిర్ రైస్ పేర్లతో కూడిన మాస్క్‌లను ధరించింది ఒసాకా.



ఇక మ్యాచ్ విషయానికి వస్తే…
ఫైనల్‌ ఫైట్‌లో ఆమె అజెరెంకాపై విక్టరీ కొట్టింది. మొదటి సెట్‌ కోల్పోయినా అధైర్యపడకుండా… ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో తన సత్తా చూపించింది. 1-6, 6-3, 6-3తో విజయం సాధించి మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

మరోవైపు… అజెరెంకాకు మూరోసారి నిరాశే ఎదురైంది. గతంలో 2012, 2013యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌ చేరినా… సెరెనా చేతిలో రెండుసార్లు ఓడిపోయింది. ఇపుడు మూడోసారి కూడా పరాజయం పాలవడంతో యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ అందుకోవాలన్న తన కల అలాగే ఉండిపోయింది.



మొత్తం 6 ఏస్ లు సంధించింది ఒసాక. 2 డబుల్ ఫాల్ట్ లతో పాటు 8 బ్రేక్ పాయింట్స్ సాధించింది. 13 అనవసరంగా మిస్టేక్స్ చేసింది. ఒసాకాకు ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. మూడో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అని చెప్పవచ్చు. 2018లో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాక.. ఏడాది వ్యత్యాసంలోనే మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది.