2023వరల్డ్ కప్ కోసం: అమెరికాలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్

2023వరల్డ్ కప్ కోసం: అమెరికాలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వన్డేకు వేదిక కానుంది. 1844వ సంవత్సరంలో కెనడాలో అమెరికా, కెనడాలోని బ్రిటిష్ ప్రావిన్స్ జట్టు కలసి తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాయి. 175ఏళ్ల తర్వాత మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ వన్డేకు తొలిసారి అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 13వ తేదీ పపువా న్యూ గినియా(పీఎన్జీ)జట్టుతో అమెరికా తలపడుతుంది. 

ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా రెండో ట్రై సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది అమెరికా. భారత్‌లో జరగనున్న వరల్డ్ కప్ 2023కు అర్హత కోసం జరుగుతున్న మ్యాచ్‌లు కాబట్టి ఈ లీగ్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. లీగ్ 2లో టాప్ 3గా నిలిచిన జట్లు మాత్రమే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటాయి. రెండున్నరేళ్ల పాటు జరగనున్న మ్యాచ్‌లలో అమెరికా, పీఎన్జీ, నమీబియాలు 36వన్డేలు ఆడనున్నాయి. 

గత నెలలో జరిగిన ట్రై సిరీస్‌లో పీఎన్జీ ఒక పాయింట్ దక్కించుకుంది. ఈ లీగ్‌లో సెప్టెంబర్ 13, 19న అమెరికా-పీఎన్జీలు, పీఎన్జీ-నమీబియా సెప్టెంబర్ 22, 23న ఆడతాయి. సెప్టెంబర్ 17, 20వ తేదీల్లో అమెరికా, నమీబియాతో ఆడుతుంది.