Video Viral: కింద పడిపోబోయిన కప్పును పట్టుకున్న కానె విలియమ్సన్.. ఇక ఆ కప్పు తమదేనంటూ..

నిన్న భారత్, న్యూజిలాండ్ సారథులు హార్దిక్ పాండ్యా, కానె విలియమ్సన్ కప్పుతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గాలి వేగంగా రావడంతో ఆ కప్పు కింద పడిపోబోయింది. దీంతో అది కింద పడకుండా కానె విలియమ్సన్ పట్టుకున్నాడు.

Video Viral: కింద పడిపోబోయిన కప్పును పట్టుకున్న కానె విలియమ్సన్.. ఇక ఆ కప్పు తమదేనంటూ..

Video Viral: న్యూజిలాండ్-టీమిండియా మధ్య రేపటి నుంచి వెల్లింగ్టన్ లో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నిన్న భారత్, న్యూజిలాండ్ సారథులు హార్దిక్ పాండ్యా, కానె విలియమ్సన్ కప్పుతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

గాలి వేగంగా రావడంతో ఆ కప్పు కింద పడిపోబోయింది. దీంతో అది కింద పడకుండా కానె విలియమ్సన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక ఆ కప్పు తమదేనని అన్నాడు. గాలి వేగానికి కప్పు కింద ఉన్న టేబుల్ పడిపోకుండా హార్దిక్ పాండ్యా పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వెల్లింగ్టన్ రీజనల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు న్యూజిలాండ్-టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ వరకూ వెళ్లి ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఫైనల్ లోకి పాకిస్థాన్, ఇంగ్లండ్ ప్రవేశించాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..