India : వినేశ్ ఫొగాట్ షాకింగ్ స్టేట్‌మెంట్‌

క్రీడాభిమానులకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ షాకిచ్చే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్‌ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె వెల్లడించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ.. అనంతర పరిణామాలు కూడా ఇందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

India : వినేశ్ ఫొగాట్ షాకింగ్ స్టేట్‌మెంట్‌

Vinesh

Vinesh Phogat : క్రీడాభిమానులకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ షాకిచ్చే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్‌ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె వెల్లడించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ.. అనంతర పరిణామాలు కూడా ఇందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More :Samantha: 3 గంటల్లో 10 లక్షల లైకులు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందబ్బా?!

భారత్‌లో ఎంత త్వరగా పైకి లేస్తామో.. అంతే త్వరగా కిందపడిపోతమని వాపోయింది వినేశ్‌. ఒక్క పతకం కూడా సాధించలేకపోయనని.. ఇప్పుడు అంతా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. మళ్లీ మ్యాట్‌పైకి ఎప్పుడు వెళతానో తెలియదని.. విరిగిన కాలు బాగుందనే అనుకుంటున్నానని.. అయితే ఇప్పుడు నా శరీర భాగం విరగలేదు కానీ మనసు మాత్రం ముక్కలైపోయిందంటూ కన్నీరు తెప్పించే వ్యాఖ్యలు చేసింది వినేశ్‌.

Read More : Rihanna: ఫోర్బ్స్‌లో రిహన్నా.. రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌‌గా రికార్డ్!

2017లో కంకషన్‌కు గురికావడం, తర్వాత రెండు సార్లు కరోనా సోకడం లాంటి పరిణామాలు టోక్యోలో తన ప్రదర్శనను ప్రభావితం చేశాయని వాపోయింది. మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందిపడినట్లు తెలిపింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రత్యర్థితో పోటీ పడుతుండగా వినేశ్‌ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఆ పోటీల నుంచి నిష్క్రమించింది. అయితే ఆ గాయం నుంచి కోలుకున్న వినేశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ క్వార్టర్‌ ఫైనల్లో బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది. తర్వాత ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా తాత్కాలిక నిషేధానికి గురైంది.