Mike Tyson : విమానంలో ప్రయాణికుడిని చితక్కొట్టిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. వీడియో వైర‌ల్!

Mike Tyson : బాక్సింగ్ లెజెండ్, మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ సహనం కోల్పోయాడు. విమానంలో తోటి ప్రయాణికుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

Mike Tyson : విమానంలో ప్రయాణికుడిని చితక్కొట్టిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. వీడియో వైర‌ల్!

Viral Video Mike Tyson Hits Passenger On A Us Plane

Mike Tyson : బాక్సింగ్ లెజెండ్, మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ సహనం కోల్పోయాడు. విమానంలో తోటి ప్రయాణికుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ప్రయాణికుడి వెర్రిచేష్టలతో విసిగిపోయిన టైసన్ ఆవేశంతో అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరనున్న విమానంలో జరిగింది. ప్రయాణికుడిని టైసన్ చితక్కొట్టిన వీడియోను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. 55ఏళ్ల మైక్ టైసన్.. ఈ నెల 20న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు విమానం ఎక్కాడు.

విమానంలో టైసన్ సీటు వెనకాల కూర్చొన్న ఓ ప్యాసింజర్ అతన్ని చూడగానే మాటలు కలిపాడు. టైసన్ కూడా నవ్వుతూనే బదులిచ్చాడు. సదరు ప్యాసింజర్ అంతటితో ఆగకుండా నాన్ స్టాప్‌గా నస పెడుతూనే ఉన్నాడు. టైసన్ అతన్ని వారించేందుకు ప్రయత్నించాడు. కొంచెం అలసటగా ఉందని న్యూసెన్స్ చేయొద్దని కోరాడు. అయినా ఆ ప్యాసింజర్ టైసన్ మాట వినలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన టైసన్ ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

వెనుక సీట్లో కూర్చొని ఉన్న ప్రయాణికుడు అదేపనిగా గ్యాప్ లేకుండా నస పెడుతూ కనిపించాడు. ముందు సీటులో కూర్చిని ఉన్న టైసన్ చాలా సేపు ఒపిక పట్టాడు. ఎంతసేపు అయినా ఆ ప్రయాణికుడు అలానే లొల్లి పెడుతుండటంతో ఆవేశం ఆపులేక టైసన్ వెంటనే పైకిలేచి వెనుక సీట్లో ఉన్న అతన్ని రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో ఆ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయినట్టు వీడియోలో కనిపిస్తోంది. TMZ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ ప్ర‌కారం.. మైక్ టైసన్ విమానంలో ప్రయాణిస్తున్నారు. అందులో క ప్రయాణీకుడు టైసన్‌పై కామెంట్ చేశాడు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్’ అంటూ ఫన్ చేశాడు. మొదట్లో అతడి కామెంట్లను బాక్సింగ్ లెజెండ్ టైసన్ పెద్దగా ప‌ట్టించుకోలేదు.

చివరికి సహనం కోల్పోయిన టైసన్ తన పంచ్ పవర్ చూపించాడు. ఇదంతా అక్కడి వారు ఫోన్లో వీడియో రికార్డు చేయడంతో వెలుగులోకి వచ్చింది. టైసన్ కొట్టే సమయంలో అతడు ‘హే మైక్, పట్టుకోండి, ఆపు. ఆపు అని గట్టిగా అరుపులు వినిపించాయి. దాడి తర్వాత ఆ బాధితుడి గాయాలను కెమెరాలో రికార్డు చేశారు. త‌ల భాగంలో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయ‌లైనట్టు కనిపిస్తోంది.

ఈఘ‌ట‌నపై తమకు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని యూఎస్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కెల్విన్ గాస్టెలం ట్విట్టర్ వేదికగా స్పందించాడు. విమానంలో మైక్ టైసన్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నాడని వివరణ ఇచ్చాడు. తోటి ప్రయాణికుడు తాగి టైసన్‌కు చిరాకు పెట్టించేలా ప్రవర్తించాడని తెలిపారు. అతడి ప్రవర్తనతో ఆగ్రహించిన టైసన్ అతన్ని చితక్కొట్టాడని తెలిపాడ. ఈ విషయంలో టైసన్‌ను తప్పుపటట్టొద్దని సూచించాడు.

Read Also : Mike Tyson : మా దేశీయ గంజాయికి అంబాసిడర్‌గా ఉంటావా? మాలావీ ప్రభుత్వం రిక్వెస్ట్!