Virat Kohli: రేపే కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్.. సెంచరీ కొట్టేనా?

భారత్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ రేపు అనగా.. మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో జరగబోతుంది.

Virat Kohli: రేపే కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్.. సెంచరీ కొట్టేనా?

Virat Kohli

Virat Kohli: భారత్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ రేపు అనగా.. మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో జరగబోతుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కాగా.. కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై ఎన్నో సెంచరీలు సాధించాడు. శ్రీలంకపై టెస్టు మ్యాచ్‌ల్లో కూడా విరాట్ అద్భుత ప్రదర్శన చేశాడు.

భారత మాజీ కెప్టెన్ కోహ్లీ మొహాలీలో 100వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇంతకు ముందు శ్రీలంకతో జరిగిన చాలా మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి, ఇప్పటి వరకు శ్రీలంకతో ఆడిన 9 టెస్టు మ్యాచ్‌ల్లో విరాట్ 1004 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ 5 సెంచరీలు సాధించాడు. ఈ జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అగ్రశ్రేణి భారత ఆటగాళ్లలో ఒకడు.

శ్రీలంకపై టెస్టుల్లో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 243 పరుగులు కాగా.. ఈ జట్టుపై రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. కోహ్లీ టెస్టు కెరీర్ మొత్తం పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లు ఆడి 7962 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 27 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో కోహ్లీ 28 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు 254 పరుగులు.

టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను ఓడించగా.. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్ ఆడేందుకు మైదానంలోకి దిగనుండగా.. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ మొహాలీలో జరగబోతుంది. రెండో మ్యాచ్ బెంగళూరులో.. మార్చి 12వ తేదీ నుంచి జరగబోతుంది.