Virat Kohli Steps Down: కెప్టెన్‌గా తప్పుకుంటా.. -విరాట్ కోహ్లీ

కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాబోయే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌ నుంచి టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించాడు.

Virat Kohli Steps Down: కెప్టెన్‌గా తప్పుకుంటా.. -విరాట్ కోహ్లీ

Kohli

Virat Kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాబోయే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌ నుంచి టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో, విరాట్ కోహ్లీ చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. పనిభారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.

టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించిన కొన్ని రోజుల్లోనే కోహ్లీ ఈ ప్రకటన చేశారు. మూడు ఫార్మాట్లలో వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతానని విరాట్ కోహ్లి చెప్పారు. తన సుధీర్ఘు టీ20 కెరీర్‌లో తనకు సపోర్ట్ చేసిన సేవకులకు, కోచెస్‌కి ధన్యవాదాలు చెప్పారు. వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి మాత్రమే ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.

గత 8నుంచి 9ఏళ్లుగా మూడు ఫార్మట్లలో రాణించడం ఆనందంగా ఉందని, ఆరేళ్ల నుంచి కెప్టెన్‌గా తనకు సహకారం అందించిన జట్టు సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. అయితే, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం తర్వాత కూడా కొనసాగుతానని, తనకు సపోర్ట్‌గా నిలిచిన, నిలుస్తోన్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రెటరీ జే షా లకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఈ విషయంలో రవిశాస్త్రి, రోహిత్ శర్మల అభిప్రాయాన్ని తీసుకున్నట్లు చెప్పారు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నిర్ణయంతో రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూఏఈలో సమరం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఎవరున్నారు? ప్లే ఆఫ్‌కు ఎవరు?

అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్‌ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్. కాగా.. విరాట్ కోహ్లీ 2017లో ధోని నుంచి అన్ని ఫార్మట్‌లలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటికే 65 మ్యాచ్‌ల్లో 38 విజయాలతో టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించాడు.

కానీ విరాట్‌ సారథ్యంలో భారత్‌ ఐసీసీ ఈవెంట్లలో ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో, 2021 ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి చవిచూసింది. అలా కోహ్లి కెరీర్‌లో ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు అనే లోటు మాత్రం ఉండిపోయింది.