INDvAUS: మ్యాచ్ ఓడినా కోహ్లీ రికార్డు

INDvAUS: మ్యాచ్ ఓడినా కోహ్లీ రికార్డు

భారత్-ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి ఆసీస్‌ను విజయం వరించింది. బ్యాట్స్‌మెన్ స్వల్ప టార్గెట్‌నే నిర్దేశించడంతో చేధనకు దిగిన ఆసీస్‌ను కట్టడి చేయడానికి భారత్ తీవ్రంగా శ్రమించింది. ఇదిలా ఉంచితే, కోహ్లీ ఖాతాలోకి ఈ మ్యాచ్‌లో మరో రికార్డు వచ్చి చేరింది. 

మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(14) పరుగులకే అవుట్ అయి వెనుదిరగడంతో 14గా ఉన్న భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కెప్టెన్  కోహ్లీ. బ్యాటింగ్‌కు దిగి 17 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. కాసేపటి వరకూ దూకుడుగా కనిపించిన భారత్.. కోహ్లీ అవుట్ అవడంతోనే సగం ఉత్సాహాన్ని కోల్పోయింది. 
Read Also: చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం

ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాపై 500 పరుగులు చేయడానికి  12 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ మ్యాచ్ అనంతరం 512 పరుగుల స్కోరుతో నిలిచాడు. 15 మ్యాచ్ ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ తొలిసారి వైజాగ్ స్టేడియంలో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ 127పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. కొద్ది మ్యాచ్‌లుగా పూర్తిగా ఫామ్ కోల్పోయిన కేఎల్ రాహుల్ మాత్రం ఈ మ్యాచ్‌లో చక్కటి ప్రతిభను కనబరిచి 35బంతుల్లోనే హఫ్ సెంచరీ చేయగలిగాడు. 
Read Also: IPL 2019 మధ్యలో ఉమెన్స్ ఐపీఎల్
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?