విరాట్ కోహ్లీ.. బెన్ స్టోక్స్ మధ్య వాగ్వాదం

విరాట్ కోహ్లీ.. బెన్ స్టోక్స్ మధ్య వాగ్వాదం

Virat Kohli – Ben Stokes: టీమిండియాతో అహ్మదాబాద్ స్టేడియం వేదికగా తలపడుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేశాడు. దానికి కోహ్లి ధీటుగా బదులిచ్చాడు. మొదటి రోజు ఆటలో భాగంగా 12వ ఓవర్‌ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్టార్‌ పేసర్‌ బుమ్రా లేకపోవడంతో ఆఖరి టెస్టులో సిరాజ్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

12వ ఓవర్‌ తొలి బంతికే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను పెవిలియన్‌కు పంపి, ఈ మ్యాచ్‌లో ఖాతాలో తొలి వికెట్‌ వేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌కు చుక్కలు చూపించాడు. మొదటి 3 బంతుల్లో ఒక్క పరుగు కూడా నమోదు చేయకుండా కట్టడి చేశాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌.. ఏదో అనబోయి ఆగిపోయాడు. సిరాజ్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. కోహ్లి మాత్రం స్టోక్స్‌ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు.

ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అంపైర్లు నితిన్‌ మీనన్‌, వీరేందర్‌ శర్మ మధ్యలో వచ్చి సర్ది చెప్పారు. మరోవైపు.. బెయిర్‌ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో.. ‘‘అసలు అక్కడ ఏం జరిగింది. కోహ్లి స్టోక్స్‌ను కోపంగా చూస్తుండటంతో మాత్రం వీడియోలో కనిపించింది.

కోహ్లి‌: కోపంగా.,.
స్టోక్స్: ఏం చెప్తున్నావు కోహ్లి‌
కోహ్లి‌: ఏం లేదు, చెప్పినా నీకర్థం కాదులే
స్టోక్స్: పర్లేదు నాకు అర్థం అయింది

ఇలా పలురకాలుగా నెటిజన్లు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.