సచిన్.. కోహ్లీ కంటే గొప్పోడు

సచిన్.. కోహ్లీ కంటే గొప్పోడు

రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జయాపజయాల మాట అటుంచితే.. కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ పై ఒంటరి పోరాటం చేసి 123పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీకిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన కోహ్లీ 120 బంతుల్లో 116 పరుగులు చేశాడు. 
Read Also : INDvAUS: మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

ఇలా వరుస వన్డే సెంచరీలతో కోహ్లీ ఖాతాలో 41 సెంచరీలు చేరాయి. ఈ క్రమంలో నెటిజన్లు సచిన్.. కోహ్లీలలో ఎవరు గొప్ప అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కోహ్లీని పాయింట్ చేస్తూ.. ‘ద గోట్ ఈజ్ ఎట్ ఎగైన్’ పొట్టేలు మళ్లీ ఊపందుకుంది. అని ట్వీట్ చేశాడు. 

ఆ ట్వీట్‌పై కామెంట్లు మొదలుపెట్టిన నెటిజన్లకు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్, లారా కంటే కోహ్లీ గొప్పవాడా కాదా.. అని అడిగిన ప్రశ్నకు వన్డే ఫార్మాట్‌లో కోహ్లీనే బెస్ట్ అంటూ సమాధానమిచ్చాడు. 
Read Also : తీపి గురుతులు :చిన్ననాటి పార్క్ కు సచిన్ గిఫ్ట్

225 వన్డేలు ఆడిన కోహ్లీ 41సెంచరీలు నమోదు చేశాడు. 225వన్డేలు ఆడిన డివిలియర్స్ 25సెంచరీలు నమోదు చేయగా, సచిన్ అవే ఇన్నింగ్స్‌లో 23 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. 

Read Also : ప్రపంచంలోనే ఖరీదైన కారు : ధర 131.33 కోట్లు