Virat Kohli: ఆ ఫీట్ సాధిస్తే రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోహ్లీ

ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ చేసే పరుగులు మరో రికార్డుతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ బ్యాట్స్‌మన్‌గా...

Virat Kohli: ఆ ఫీట్ సాధిస్తే రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోహ్లీ

Virat Koli

Virat Kohli: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆతిథ్య జట్టు చేతిలో ఏడు వికెట్ల తేడాతో రెండో టెస్టును ఓడిపోయింది టీమిండియా. అలా ఇరు జట్లు 1-1గా ఉండటంతో నిర్ణయాత్మకమైన మూడోది అయిన చివరి టెస్టు గెలిచేందుకు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. కెప్టెన్సీ పగ్గాలు అందుకుని జట్టును నడిపించేందుకు జనవరి 11నాటికల్లా కోహ్లీ రెడీ అవబోతున్నాడు.

ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ చేసే పరుగులు మరో రికార్డుతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ బ్యాట్స్‌మన్‌గా చేసిన పరుగులకు కేవలం 14పరుగుల దూరంలో నిలిచాడు విరాట్. అలా చేస్తే మాత్రం దక్షిణాఫ్రికా వేదికగా అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా విరాట్ నిలిచిపోతాడు.

కోహ్లీ ఇప్పటికీ 611 పరుగులు మాత్రమే నమోదు చేయా ద్రవిడ్ 624నమోదు చేశాడు. బ్యాటింగ్ మ్యాస్ట్రో మరోవైపు 15టెస్టులు ఆడి 1161పరుగులు చేయగలిగాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రికార్డుతో పాటు ఇండియా టెస్టు సిరీస్ గెలావాల్సి కూడా ఉంది.

ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!