Virat Kohli: కోహ్లీ లేకుండా రోహిత్.. ఆసియా కప్ గెలిచాడు

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. బుధవారం రోహిత్ ను వన్డే కెప్టెన్ గా కూడా నియమిస్తూ..

Virat Kohli: కోహ్లీ లేకుండా రోహిత్.. ఆసియా కప్ గెలిచాడు

Virat Kohli (2)

Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. బుధవారం రోహిత్ ను వన్డే కెప్టెన్ గా కూడా నియమిస్తూ.. అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దాని గురించి వివరణ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం బీసీసీఐకు నచ్చలేదు. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని వీడొద్దని చెప్తే వినలేదని అన్నాడు.

‘రోహిత్ శర్మకు లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ లో గ్రేట్ రికార్డ్ ఉంది. సెలక్టర్లు అందుకే అతణ్ని ఎంపిక చేశారు. అతనొక కొత్త దారి కనిపెట్టి జట్టును ఇంప్రూవ్ చేస్తాడని ఆశిస్తున్నా. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా అత్యద్భుతం. ఐదు టైటిల్స్ సాధించిపెట్టాడు. కొన్నేళ్ల క్రితం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి ఆసియా కప్ కూడా తెచ్చిపెట్టాడు. అది కూడా కోహ్లీ లేకుండానే జరిగింది’

‘కోహ్లీ లేకుండానే గెలవగలిగారని అంటే.. టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. అందుకే పెద్ద టోర్నమెంట్లలో సక్సెస్ సాధించగలిగాడు. టీం బాగుంది. ఇంకా ముందుకెళ్తుందని ఆశిస్తున్నానని’ వివరించాడు గంగూలీ.

………………………………….: యువీకి కోహ్లీ విషెస్.. మా ఇద్దరం చాలా కామన్