Virat Kohli: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ తల్లి చికిత్సకు రూ. 6.77లక్షలు విరాళమిచ్చిన కోహ్లీ

దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కొవిడ్-19పై పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేస్తున్న ప్రచారంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇండియా మాజీ క్రికెటర్

Virat Kohli: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ తల్లి చికిత్సకు రూ. 6.77లక్షలు విరాళమిచ్చిన కోహ్లీ

Virat Kohli

Virat Kohli: దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కొవిడ్-19పై పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేస్తున్న ప్రచారంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇండియా మాజీ క్రికెటర్ కేఎస్ స్రవంతి నాయుడు తల్లికి రూ.6.77లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆమె తల్లి కరోనావైరస్ పాజిటివ్ తో బాధపడుతుంది.

దీనిపై స్పందించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ట్వీట్ చేశారు. ఇప్పటికే రూ.16లక్షలు ఖర్చు పెట్టారని ఎవరైనా ఆదుకోవాలంటూ ట్వీట్ చేశారు. కోహ్లీ చేసిన సాయంపై బీసీసీఐ సౌత్ జోన్ కన్వీనర్ ఎన్ విద్యా యాదవ్ మాట్లాడుతూ కోహ్లీ సకాలంలో స్పందించారని కొనియాడారు.

నిజాయతీగా చెప్తున్నా. అతని స్పాంటేనియస్ రియాక్షన్ కు అద్భుతం. గ్రేట్ క్రికెటర్ నుంచి గ్రేట్ రియాక్షన్. అని చెప్పారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, హనుమ విహారీలను ట్యాగ్ చేసిన ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కు కూడా థ్యాంక్స్ చెప్పారు.

కోహ్లీ-అనుష్క దంపతులు కాంపైన్ చేపట్టి కొవిడ్ రిలీఫ్ కోసం రూ.11కోట్లు విరాళాలు సేకరించారు. వారి తరపు నుంచి రూ.2కోట్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.