ICC Test rankings: టెస్టు ర్యాంకుల్లో 14వ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ తాజా టెస్టు ర్యాకింగ్స్ లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ను ఇటీవలే టీమిండియా 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ లో సరిగ్గా రాణించని టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 2 స్థానాలు కోల్పోయి 14వ స్థానానికి దిగజారాడు. ఆరేళ్లుగా విరాట్ కోహ్లీ ఇంత తక్కువ ర్యాంకుకు ఎన్నడూ దిగజారలేదు.

ICC Test rankings: టెస్టు ర్యాంకుల్లో 14వ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ

Virat Kohli

ICC Test rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ తాజా టెస్టు ర్యాకింగ్స్ లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ను ఇటీవలే టీమిండియా 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ లో సరిగ్గా రాణించని టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 2 స్థానాలు కోల్పోయి 14వ స్థానానికి దిగజారాడు. ఆరేళ్లుగా విరాట్ కోహ్లీ ఇంత తక్కువ ర్యాంకుకు ఎన్నడూ దిగజారలేదు.

బ్యాటింగ్ లో 10 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. ఇక ఆరో స్థానంలో రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. తన తొమ్మిదో స్థానాన్ని రోహిత్ శర్మ నిలబెట్టుకున్నాడు. బ్యాటింగ్ లో మార్నస్ లాబుస్చాగ్నే (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉన్నాడు.

బౌలింగ్ లో బుమ్రా నాలుగో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నారు. వారిద్దరికీ 812 పాయింట్ల చొప్పున ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్లలో మొదటి స్థానంలో రవీంద్ర జడేజా నిలిచాడు. రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు.

కాగా, ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో టీమిండియా 74 పరుగులకే టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయినప్పటికీ, అనంతరం ఓడిపోయే స్థితి నుంచి భారత్ ను అశ్విన్, శ్రేయాస్ కాపాడిన విషయం తెలిసిందే. అశ్విన్ 42, శ్రేయాస్ 29 పరుగులు చేశారు. వారి ర్యాంకులు మెరుగుపడ్డాయి.

Masooda: ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న మసూద.. 100 మిలియన్ నిమిషాల పాటు భయపెడుతూనే ఉందట!