Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై

తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై

Virat Kohli

Virat Kohli Test Captain : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అభిమానులు షాక్ కు గురయ్యారు. గత కొన్ని రోజులుగా టెస్టు కెప్టెన్సీపై వస్తున్న వార్తలకు కోహ్లీ చెక్ పెట్టారు. 2022, జనవరి 15వ తేదీ శనివారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Read More : Minister Balineni : చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచన జగన్‌కు లేదు-మంత్రి బాలినేని

ఏడు సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ చేసినట్లు, టీంను రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్లే ప్రయత్నం తాను చేయడం జరిగిందన్నారు. తాను వైదొలగడానికి ఎలాంటి కారణాలను లేవని స్పష్టం చేశారు. క్రికెట్ ప్రయాణంలో పైకి ఎదగడం, కిందకు దిగజారడం జరుగుతుంటాయని, అయినా..తన ప్రయత్నాన్ని మాత్రం మానలేదన్నారు. బీసీసీఐకి కృతజ్ఞతలు ట్వీట్ లో తెలిపారు.

Read More : Kerala CM : అమెరికాకు కేరళ సీఎం.. అక్కడి నుంచే పాలన

ఇంతకాలం తనను టెస్టు కెప్టెన్సీగా కొనసాగించినందుకు మొదటి రోజు నుంచి టీమ్ సభ్యులతో చక్కటి సహకారం తీసుకోవడం జరిగిందన్నారు. చివరిలో తాను ఎం.ఎస్.ధోనికి బిగ్ థాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ గా నమ్మినందుకు..తనను ప్రోత్సాహించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కోహ్లీ ట్వీట్ లో తెలిపారు.

Read More : Volcanic Eruption : పేలిన అగ్నిపర్వతం.. దూసుకొచ్చిన సముద్రం.. సునామీ హెచ్చరిక

2014లో కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. అనంతరం టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో ఉండేందుకు  ఆయన చేసిన విశేషంగా కృషి చేశారు. ఆయన కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు అందుకుంది టీమిండియా. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2019-21 ఫైనల్ కు కూడా అర్హత సాధించింది. మొత్తం ఆయన 68 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు.

Read More : Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

అందులో 40 విజయాలున్నాయి. అత్యధికమైన విజయాలు అందించిన కెప్టెన్ గా నిలిచారు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టూర్ లో అద్భుతమైన విజయాలు అందుకున్న తర్వాత..సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. సడెన్ గా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.