Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. "మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది" అని వర్గాలు వెల్లడించాయి.

Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్

Virat Kohli

Virat Kohli: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. “మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది” అని వర్గాలు వెల్లడించాయి.

“దీనిని బట్టి చూస్తుంటే.. జూన్ 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే భారత టూర్ గేమ్… కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నంత తీవ్రంగా ఉండదనిపిస్తోంది. ఎందుకంటే కొవిడ్ -19 బారిన పడిన తర్వాత ఆటగాళ్లను ఓవర్‌లోడ్ చేయొద్దని వైద్య సలహా. బృందంలో మరిన్ని కోవిడ్ కేసులు ఉండవచ్చు” అనే అనుమానంలో కనిపిస్తున్నారు.

కోహ్లీ జట్టులో కీలక సభ్యుడిగా ఉండటంతో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టుకు దూరం కావాల్సి వస్తే అది టీమిండియాకు దురదృష్టకరమే. టెస్టుకు ఇంకా సమయం ఉంది కాబట్టి కోహ్లీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.

Read Also: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు

అంతకంటే ముందు కొవిడ్ రావడంతో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంగ్లాండ్ బస్సు ఎక్కలేదు.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 1 నుంచి 5 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టు ప్రారంభం కానుంది. కోవిడ్ -19 వ్యాప్తి ఆందోళనతో గతేడాది సెప్టెంబర్ 10న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కావాల్సిన ఐదో, చివరి టెస్టుకు ముందు భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.

ఇంతలో, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో పాల్గొని బెంగళూరు నుంచి ఇంగ్లాండ్‌కు బయల్దేరారు. సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.