Virat Kohli: మరోసారి ఫ్రస్టేషన్ లో కోహ్లీ.. అంపైర్

. ఫైనల్ ఇన్నింగ్స్ 37వ ఓవర్ లో అడిగిన రివ్యూ రస్సె వాన్ డెర్ డస్సెన్ కు అనుకూలంగా వెళ్లింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మరోసారి కూల్ నెస్ కోల్పోయాడు.

10TV Telugu News

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఆ పేరే ఓ అగ్రెషన్. ఓటమినైనా, గెలుపునైనా రియాక్షన్ క్లియర్ కట్ గా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు మ్యాచ్ లోనూ అదే జరిగింది. ఫైనల్ ఇన్నింగ్స్ 37వ ఓవర్ లో అడిగిన రివ్యూ రస్సె వాన్ డెర్ డస్సెన్ కు అనుకూలంగా వెళ్లింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మరోసారి కూల్ నెస్ కోల్పోయాడు.

మూడో రోజు ఆటలోనూ ఇదే జరిగింది. వాన్ డెర్ డస్సెన్ ను షమీ పడగొట్టాడు. అంపైర్ నో చెప్పడంతో కోహ్లీ రివ్యూకి వెళ్లాడు. రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకినట్లుగా స్పైక్స్ కనిపించాయి. కానీ, అంపైర్ ఎరాస్మస్ తాను చెప్పిన దానికే కట్టుబడి ఉండాలని చెప్పాడు.

ఆ ఫ్రస్ట్రేషన్ లో కోహ్లీ.. అంపైర్ మరైస్ ఎరాస్మస్ వైపు కోపంలో కామెంట్ చేయడంతో పాటు వాన్ డెర్ డస్సెన్ పై కాసేపు వాదనకు దిగాడు. రెండో టెస్టులో పంత్ కు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నీకంటే ఐదేళ్లు చిన్నవాడిని స్లెడ్జింగ్ చేస్తావా అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో ఈ రోజు,రేపు వర్షాలు

గురువారం ఉధయం సమయంలో కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ అంపైరింగ్ పై, టెక్నాలజీపై స్టంప్ మైక్ లో వినపడేలా కామెంట్లు చేశారు. మూడో రోజు కెప్టెన్ డీన్ ఎల్గర్ గురించి డీఆర్ఎస్ అడిగిన తర్వాతే ఇలా మాట్లాడుకోవడం గమనార్హం.

×