కోహ్లీకి ఇది 9వ సారి.. బ్యాట్స్‌మన్‌గా చెత్త రికార్డు

కోహ్లీకి ఇది 9వ సారి.. బ్యాట్స్‌మన్‌గా చెత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటే ఓ అగ్రెసివ్ స్పెషల్ బ్యాట్స్‌మన్. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సౌథీ చేతిలో కోహ్లీ 15పరుగులకే వెనుదిరిగాడు. ఈ సారితో టిమ్ సౌథీ చేతిలో 6వ సారి అవుట్ అయిన వాడిగా కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతనితో పాటు వెస్టిండీస్ బౌలర్ రవి రాంపాల్ కూడా వన్డే ఫార్మాట్లో కోహ్లీను ఆరు సార్లు అవుట్ చేశాడు. 

వన్డే ఫార్మాట్‌లో కోహ్లీని తీశారా పెరీరా, ఆడం జంపాలు చెరో 5సార్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జేమ్స్ అండర్సన్, గ్రేమ్ స్వాన్‌లు చెరో 8సార్లు అవుట్ చేయగలిగారు. మోర్నె మోర్కెల్, నాథన్ లయన్, జంపా, రాంపాల్ లు ఫార్మాట్లతో సంబంధం లేకుండా 8సార్లు అవుట్ చేశారు. కెప్టెన్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగినా.. అదే బౌలర్ల చేతిలో రిపీటెడ్ గా అవుట్ అవడం గమనార్హం. కోహ్లీ విమర్శకులకు చేతినిండా పనికి దొరికినట్లయింది.

శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగుల చేసింది. 274 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్.. 9బంతులు ఉండగానే ఆలౌట్ గా వెనుదిరిగింది.  ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది.