విలువైన సెలబ్రిటి కోహ్లీ, కిందకు పడిపోయిన ధోనీ

విలువైన సెలబ్రిటి కోహ్లీ, కిందకు పడిపోయిన ధోనీ

Virat Kohli : టీమ్‌ ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా మరోసారి మారిపోయాడు. 237.7 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ సెలబ్రిటీ వాల్యుయేషన్‌ స్టడీ -2020 తెలిపింది. రెండు, మూడు స్థానాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ఈ జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌లు అక్షయ్‌కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌ 118 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో నిలువగా.. రణ్‌వీర్‌సింగ్‌ 102.9 మిలియన్‌ డాలర్లలో మరోసారి సెకండ్‌, థర్డ్‌ ప్లేస్‌లో నిలిచారు. గతేడాది రణ్‌వీర్‌తో కలిసి మూడో స్థానాన్ని పంచుకున్న దీపికా పదుకొణె విలువ 2020లో 46శాతం పడిపోయి 50.4 మిలియన్లకు చేరింది. అంతుకుముందు 2019లో ఆమె బ్రాండ్‌ విలువ 93.5 మిలియన్‌ డాలర్లు.

టాప్ 10 సెలబ్రిటీల విలువ గతేడాది సంయుక్తంగా 4 శాతం పడిపోయి 818.3 మిలియన్ డాలర్ల నుంచి 785.6 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక్కడ ఆసక్తి రేపుతున్న అంశమేమంటే.. టాప్-3లో ఉన్న కోహ్లీ, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్‌ల బ్రాండ్ మొత్తం విలువ 459.5 మిలియన్ డాలర్లు. ఇది టాప్-10లో ఉన్న వారి బ్రాండ్ విలువలో 58.5 శాతం.. కోహ్లీ బ్రాండ్ విలువలో ఎలాంటి మార్పు లేకపోగా, కరోనా మహమ్మారి కాలంలోనూ అక్షయ్, రణ్‌వీర్ సింగ్‌ల బ్రాండ్ విలువ మాత్రం 13.8, 10.1 శాతం పెరిగింది. 2019లో పదో స్థానంలో ఆయుష్మాన్ ఖురానా ఈసారి మాత్రం ఆరో స్థానానికి ఎగబాకాడు. అతడి బ్రాండ్ విలువ 19 శాతం పెరిగింది. ఫలితంగా 40.3 మిలియన్ల నుంచి ఒక్కసారిగా 48 మిలియన్ డాలర్లకు పెరిగింది. ధోనీ టాప్-10 నుంచి కిందికి పడిపోయాడు.