Virat Kohli : అయ్యయ్యో.. 3 వన్డేల్లో 26 పరుగులు, 8సార్లు డకౌట్.. విరాట్ కోహ్లీకి ఏమైంది?

విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో కోహ్లి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.

Virat Kohli : అయ్యయ్యో.. 3 వన్డేల్లో 26 పరుగులు, 8సార్లు డకౌట్.. విరాట్ కోహ్లీకి ఏమైంది?

Virat Kohli

Virat Kohli : వన్డేల్లో పరుగుల వరద పారించాడు. సెంచరీల మీద సెంచరీలు బాదాడు. రన్ మెషీన్ గా గుర్తింపు పొందాడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. సక్సెస్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లికి ఏమైంది? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వన్డేల్లో విరాట్ కోహ్లి దారుణంగా విఫలం అవుతున్నాడు. తాజాగా వెస్టిండీస్ తో సిరీస్ లో కోహ్లి బ్యాటింగ్ చూసి అభిమానులే కాదు క్రికెట్ దిగ్గజాలు సైతం విస్తుపోతున్నారు.

IPL auction 2022: వేలంలో అండర్-19 ప్రపంచ కప్‌ విజేతలు..

విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో కోహ్లి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. 80 నెలల తర్వాత ఓ వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. అలాగే వరుసగా 7 సిరీస్ లలో(2019 నుంచి) సెంచరీ కొట్టలేకపోయాడు. ఇక స్వదేశంలో ఏకంగా 8సార్లు డకౌట్ అయ్యాడు. వన్డేల్లో పరుగులు, సెంచరీల వదర పారించి కింగ్ అనిపించుకున్న కోహ్లి.. ఇలా ఫెయిల్ అవుతుండటంతో క్రికెట్ దిగ్గజాలు సైతం షాక్ అవుతున్నారు.

విండీస్ తో ఆఖరి వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. 96 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

టీమిండియాతో వైట్ వాష్ కు గురైన విండీస్ జట్టు చెటట్ రికార్డును నమోదు చేసింది. 2019-22 మధ్య కాలంలో విండీస్ విదేశాల్లో వైట్ వాష్ కావడం ఇది 11వ సారి. 1999-20 మధ్య 9 సిరీస్ లలో, 2009-10 మధ్య కాలంలో 8 సిరీస్ లలో వైట్ వాష్ అయ్యింది. విండీస్ ఆటతీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

IPL auction 2022: వేలంలో “ఆ నలుగురు” కోసం భారీ డిమాండ్!

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు వెస్టిండీస్ పై వన్డే సిరీస్ లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. చివరి వన్డేలోనూ టీమిండియానే విజయం వరించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల భారీ తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.

266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో 3 వికెట్లు తీశారు. దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. విండీస్ జట్టులో ఓడియన్ స్మిత్ (36) టాప్ స్కోరర్.

ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఈ నెల 16న జరగనుంది.