Virat Kohli: క్రికెట్‌లోనే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌‌లోనూ విరాట్ కోహ్లీ హవా.. ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన 20మంది వ్యక్తుల్లో కోహ్లీ ఒకరు.

Virat Kohli: క్రికెట్‌లోనే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌‌లోనూ విరాట్ కోహ్లీ హవా.. ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు

Virat Kohli

Virat Kohli: ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు ఎక్కువే. కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడంటే టీవీలకు అతక్కుపోయేవారు ఉన్నారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేక పోయినప్పటికీ.. విరాట్ కోహ్లీ అద్భుత ఆటతీరును కనబర్చాడు. తద్వారా క్రికెట్‌ ప్రపంచంలో తన హవాను కొనసాగిస్తున్నాడు. క్రికెట్‌లోనే కాదు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. తద్వారా భారతదేశంలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.

Instagram Job Scam: ఉద్యోగం కోసం ఇన్‭స్టాగ్రాంలో అప్లై చేస్తే.. బ్యాంకు నుంచి రూ. 8.6 లక్షలు మాయం

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కోహ్లీ ఓ ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు. తద్వారా భారత దేశం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగిన మొదటి వ్యక్తిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. తద్వారా క్రీడాకారుల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో కోహ్లీ నిలిచాడు.

Instagram Verification Trick : మీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10K కన్నా తక్కువ ఫాలోవర్లు ఉన్నా.. బ్లూ టిక్ బ్యాడ్జ్ వెరిఫై చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 585 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. మరో ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 464 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఆటగాడు కోహ్లీ కావటం గమనార్హం.

Virat Kohli: కోహ్లీ వర్సెస్ నవీన్-ఉల్-హక్ మధ్యలో రసాలూరే మ్యాంగో.. మామిడి పండ్లతో ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు?

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు కలిగిన 20 మంది వ్యక్తుల్లో కోహ్లీ ఒకరు. కోహ్లీ 15వ స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానంలో భారత దేశం నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 86.7 మిలియన్ల ఫాలోవర్లతో 42వ స్థానంలో, శ్రద్ధా కపూర్ 80.2 మిలియన్ల ఫాలోవర్లతో 44వ స్థానంలో ఉన్నారు.