Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదంపై స్పందించిన విరాట్ కోహ్లి

ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంపై భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదంపై స్పందించిన విరాట్ కోహ్లి

Odisha Train Accident

Odisha Train Accident-Virat Kohli: ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంపై భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపాడు. ‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ప్ర‌మాదంలో కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారికి నా సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ప్ర‌యాణీకులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను.’ అని విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు.

విరాట్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు ఇటీవ‌లే కోహ్లి అక్క‌డ‌కు వెళ్లాడు. జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఓవ‌ల్ వేదిక‌గా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇప్ప‌టికే లండ‌న్ చేరుకున్న టీమ్ఇండియా ఆట‌గాళ్లు ప్రాక్టీస్ మొద‌లెట్టేశారు. మొద‌టి ప్ర‌య‌త్నంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భార‌త జ‌ట్టు ఈ సారి డ‌బ్ల్యూటీసీ విజేత‌గా నిల‌వాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఇదిలా ఉంటే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుగా పట్టాలు తప్పడం పెను ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ తెలిపింది. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగిలను బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘ‌ట‌న‌లో 270 మంది మందికి పైగా మ‌ర‌ణించ‌గా 900 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.