ఆల్‌రౌండర్‌గా పాండ్యా కంటే కోహ్లీ, రోహిత్‌లే బెటర్: ఐసీసీ

ఆల్‌రౌండర్‌గా పాండ్యా కంటే కోహ్లీ, రోహిత్‌లే బెటర్: ఐసీసీ

భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఫార్మాట్‌కు అతీతంగా రెచ్చిపోతున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019తర్వాత టెస్టు ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో విజృంభించిన రోహిత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందంజలో ఉన్నాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో పాండ్యాను కూడా దాటేశారు రోహిత్, కోహ్లీలు. 

అఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీ 339 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే గ్లెన్ మ్యాక్స్‌వెల్ 333పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఆశ్చర్యకరంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా క్రికెటర్లలో బెటర్ ఆల్ రౌండర్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 
ఆస్ట్రేలియా ప్లేయర్ డార్సీ షార్ట్‌తో కలిసి 22వ స్థానంలో నిలిచాడు. 

ఇక తర్వాతి భారత ప్లేయర్‌గా కృనాల్ పాండ్యా 41వ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. టీమిండియాలో ప్రస్తుత ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా మాత్రం 64రేటింగ్ పాయింట్లతో 58వ స్థానానికి చేరుకున్నాడు. హార్దిక్ కంటే బెటర్ పొజిషన్ లో 75 పాయింట్లతో రోహిత్ 48వ స్థానంలో నిలిచాడు.