IPL 2023: స్టేడియంలో ప్రేక్షకులను కాపాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా హంగామా చేయడం గమనార్హం.

Virat Kohli fans
IPL 2023 – Kohli: ఐపీఎల్-2023లో ఆదివారం జరగాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్ మ్యాచ్ లో ఫ్యాన్స్ పై వర్షం పడకుండా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పోస్టర్ కాపాడింది. మ్యాచ్ జరగాల్సిన సమయంలో భారీ వర్షం అడ్డుపడడంతో స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు తడిచిపోయిన విషయం తెలిసిందే.
అందులో కొందరు ప్రేక్షకులు తడిచిపోతున్న సమయంలో విరాట్ కోహ్లీ పోస్టర్ ను పైకి లేపి పట్టుకున్నారు. ఆ భారీ పోస్టర్ కిందకు చేరిన ప్రేక్షకులు తడవలేదు. ఆ పోస్టర్ పై కోహ్లీ ఫొటోనే కాకుండా కోహ్లీ కోహ్లీ అని రాసి ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఆ పోస్టర్ ను వానపడకుండా అడ్డంగా పెట్టుకున్న సమయంలోనూ ప్రేక్షకులు కోహ్లీ… కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ క్రికెట్ దేవుడు కోహ్లీనే తమను కాపాడాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా హంగామా చేయడం గమనార్హం. ధోనీ, కోహ్లీకి ఉన్న క్రేజ్ అటువంటిది మరి.
Kohli-Kohli chants in final Match of IPL as King providing them a shelter.
The Aura of God Virat Kohli! 🙇🏻 pic.twitter.com/DBSct4hukQ
— Shaurya (@Kohli_Dewotee) May 29, 2023
— Out Of Context Cricket (@GemsOfCricket) May 29, 2023
IPL 2023: ఫైనల్ మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడడంపై మీమ్స్.. ఇక మెట్రో ట్రైన్లోనైతే…