Virat Kohli: ‘కోహ్లీ ఫోన్ స్విచాఫ్ ఉంది.. గంగూలీ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’

టీ20 ఫార్మాట్‌కే కాదు.. వన్డే ఫార్మాట్ కు కూడా రోహిత్ నే కెప్టెన్ గా కన్ఫామ్ చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. దీనిపై మాజీ కెప్టెన్ గంగూలీ కూడా వివరణ ఇచ్చాడు. రెండు వైట్ బాల్..

Virat Kohli: ‘కోహ్లీ ఫోన్ స్విచాఫ్ ఉంది.. గంగూలీ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’

Virat Kohli

Virat Kohli: టీ20 ఫార్మాట్‌కే కాదు.. వన్డే ఫార్మాట్ కు కూడా రోహిత్ నే కెప్టెన్ గా కన్ఫామ్ చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. దీనిపై మాజీ కెప్టెన్ గంగూలీ కూడా వివరణ ఇచ్చాడు. రెండు వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్లు ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోహ్లీని వన్డే ఫార్మాట్ నుంచి తప్పించారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే కొందరు మాజీల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

విరాట్‌ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్ శర్మ ఆక్షేపిస్తూ.. గంగూలీ కామెంట్లు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయన్నాడు. ‘కెప్టెన్‌గా విరాట్‌ స్థానంలో రోహిత్‌ను నియమించడంపై సెలెక్షన్‌ కమిటీ దగ్గర సరైన లేదు. టీమిండియా మేనేజ్‌మెంట్ లేదా బీసీసీఐ లేదా సెలక్టర్లకు ఏం కావాలో అర్థం కావడం లేదు. సరైన వివరణ లేక పారదర్శకత లోపించింది’ అని పేర్కొన్నారు.

‘టీ20 కెప్టెన్సీని వదిలేయొద్దంటూ కోహ్లీని బీసీసీఐ కోరిందని గంగూలీ చెప్పారు. అలా అడిగినట్లు నాకైతే గుర్తు లేదు. ఈ స్టేట్‌మెంట్‌ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్‌ మార్పు జరిగిన తర్వాత కోహ్లీతో మాట్లాడలేదు. అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్లున్నాడు. టీ20 కెప్టెన్‌గా తానే తప్పుకున్నాడు కానీ, ఆ సమయంలోనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోమని సెలెక్టర్లు అడిగి ఉండాల్సింది. లేకపోతే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గానే ఉండాలని చెబితే బాగుండేది’ అని రాజ్‌కుమార్‌ శర్మ వివరించారు.

ఇండియాలో పుట్టి విదేశాలకు ఆడుతున్న క్రికెటర్లు

కోహ్లీ కెప్టెన్సీ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ తీరును పాకిస్థాన్ స్పిన్నర్‌ డానిష్ కనేరియా తప్పుబట్టాడు. కోహ్లీకి సరైన గౌరవం ఇవ్వకుండా సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లకు రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్సీ వహించనుండగా.. టెస్టు జట్టుకు మాత్రమే విరాట్ కోహ్లీ కెప్టెన్.