Virat Kohli: వాట్ ఏ కాన్ఫిడెన్స్.. విరాట్ 86మీటర్ల లెంగ్త్ సిక్స్

విరాట్ విరుచుకుపడ్డాడు. ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి షార్జా స్టేడియం వేదికగా హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు చెన్నై సూపర్ కింగ్స్‌పై అటాకింగ్ మోడ్‌.

Virat Kohli: వాట్ ఏ కాన్ఫిడెన్స్.. విరాట్ 86మీటర్ల లెంగ్త్ సిక్స్

Virat Kohli

Virat Kohli: విరాట్ విరుచుకుపడ్డాడు. ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి షార్జా స్టేడియం వేదికగా హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు చెన్నై సూపర్ కింగ్స్‌పై అటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. ఆరు అందమైన బౌండరీలతో పాటు ఒక సిక్సు బాది 53స్కోరు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో హైలెట్ బాదిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రస్తుత ఐపీఎల్ 35వ మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య షార్జా వేదికగా జరగ్గా.. ఇరు జట్లు టాప్ 4తోనే గేమ్ ఆడించేశాయి. ఆర్బీబీ ఓపెనర్లు చెలరేగిపోగా.. విరాట్ సిక్సుతో సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో.. వచ్చిన బంతిని కరెక్ట్ గా అంచనా వేశాడు. మిడ్ వికెట్ దిశగా దూసుకొచ్చిన బంతిని టార్గెట్ చేసి బాదినట్లుగా ఆడేసి.. ఎక్కడికి వెళ్తుందో తనకు తెలుసు అన్నట్లుగా దానివైపే చూడకుండా ఉండిపోయాడు. క్లాస్ అండ్ కాన్ఫిడెంట్ షాట్ అని మెచ్చేసుకున్నారు కామెంటర్లు సైతం.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 9మ్యాచ్ లు ఆడి 14పాయింట్లతో టాప్ లో ఉంది. సీఎస్కే, ఆర్సీబీలు రెండు.. మూడు స్థానాల్లో నిలిచాయి.

……………………………………………….Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!

మ్యాచ్ జరిగిందిలా:
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, పడిక్కల్ శుభారంభం ఇచ్చినా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. దీంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న బెంగళూరు మోస్తరు స్కోర్ కే పరిమితం అయ్యింది.

అనంతరం ఛేజింగ్ కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 38, డుప్లిసెస్ 31, రాయుడు 32 పరుగులు చేశారు. చివరల్లో రైనా, ధోని జట్టుకు విజయాన్ని అందించారు. గత 5 మ్యాచుల్లో బెంగళూరు 3 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచుల్లో గెలిచింది.