Virender Sehwag: శుభ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లికి నో ఛాన్స్‌.. ఐపీఎల్‌లో టాప్‌-5 బ్యాట‌ర్ల‌ను సెల‌క్ట్ చేసిన సెహ్వాగ్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2023 సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. దాదాపు రెండు నెల‌లుగా క్రికెట్ ప్రియుల‌ను అల‌రిస్తోస్తున్న ఈ సీజ‌న్‌ ఆదివారం(మే 28) గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌తో ముగియ‌నుంది.

Virender Sehwag: శుభ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లికి నో ఛాన్స్‌.. ఐపీఎల్‌లో టాప్‌-5 బ్యాట‌ర్ల‌ను సెల‌క్ట్ చేసిన సెహ్వాగ్‌

Virender Sehwag's top 5 batters of IPL 2023

Virender Sehwag’s top 5 batters of IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2023 సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. దాదాపు రెండు నెల‌లుగా క్రికెట్ ప్రియుల‌ను అల‌రిస్తోస్తున్న ఈ సీజ‌న్‌ ఆదివారం(మే 28) గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌తో ముగియ‌నుంది. ఈ సారి కొంద‌రు కుర్రాళ్లు త‌మ ఆట‌తో ఆకట్టుకోగా తామేమీ త‌క్కువ కాదంటూ సీనియ‌ర్లు స‌త్తా చాటారు. గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) 851 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో అంద‌రి కంటే ముందు ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ క్యాప్ అత‌డి వ‌ద్దే ఉంది.

ఈ సీజన్‌లో రాణించిన ఆట‌గాళ్ల నుంచి ఐదుగురు అత్యుత్త‌మ ప్లేయ‌ర్ల‌ను టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఎంచుకున్నాడు. అయితే.. ఈ జాబితాలో భార‌త స్టార్ ఆట‌గాడు అయిన విరాట్ కోహ్లి, యంగ్ ప్లేయ‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ల‌కు చోటు ద‌క్క‌లేదు. ఇద్ద‌రు అన్‌క్యాప్‌డ్ ఆట‌గాళ్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ సీజ‌న్‌లో విరాట్ రెండు శ‌త‌కాలు చేయ‌గా గిల్ మూడు సెంచ‌రీలు బాదాడు.

Virat Kohli: కోహ్లీ వర్సెస్ నవీన్-ఉల్-హక్ మధ్యలో రసాలూరే మ్యాంగో.. మామిడి పండ్లతో ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు?

బ్యాటింగ్‌లో రాణించిన వారి నుంచి నేను ఐదుగురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నా.ఇందులో ఎక్కువ‌గా ఓపెన‌ర్లను సెల‌క్ట్ చేయ‌లేదు. ఎందుకంటే వారికి ఎక్కువ‌గా ప‌రుగులు తీసే అవ‌కాశం ఉంటుంది గ‌నుక‌. నా లిస్ట్‌లోకి వెళితే.. మొద‌టి ఆట‌గాడు రింకూ సింగ్‌. అత‌డిని ఎందుకు సెల‌క్ట్ చేశానో అంద‌రికి తెలిసే ఉంటుంది. చివ‌రి ఓవ‌ర్‌లో వ‌రుస‌గా ఐదు బంతుల్లో ఐదు సిక్స‌ర్లు కొట్టి త‌న జ‌ట్టును గెలిపించాడు. ఇది వ‌ర‌కు ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. రింకూ వ‌ల్లే సాధ్య‌మైంది.

రెండోవ ఆట‌గాడు శివ‌మ్ దూబే. ఈ సీజ‌న్‌లో అత‌డు 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 33 సిక్స‌ర్లు కొట్టాడు. గ‌త సీజ‌న్ల‌లో రాణించ‌న‌ప్ప‌టికి ఈ సీజ‌న్‌లో ప‌క్క ప్ర‌ణాళిక‌తో బ్యాటింగ్ చేశాడు. అత‌డు చెన్నైకి విలువ ఆస్తిగా మారాడు. ఇక మూడో ఆట‌గాడి విష‌యానికి వ‌స్తే అత‌డు ఖ‌చ్చితంగా రాజ‌స్థాన్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌. అత‌డి అద్భుత‌మైన బ్యాటింగ్ వ‌ల్లే అత‌డిని ఎంపిక చేయాల్సి వ‌చ్చింది.

IPL2023: ఐపీఎల్ విజేత‌కు ఎన్నికోట్లంటే..? ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ ఆట‌గాళ్ల‌కి ఎంతిస్తారంటే..?

ఇక నాలుగో ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌. ఎందుకంటే అత‌డు ఈ సీజ‌న్ ముందుకు వ‌ర‌కు పెద్ద‌గా ఫామ్‌లో లేడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచుల్లో సైతం రాణించ‌లేదు. అయినా ఒక్క‌సారి జోరు అందుకున్నాక మాత్రం ఇక వెనుదిరిగి చూసుకోలేదు. చివ‌రి ఆట‌గాడిగా స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు హెన్రిక్ క్లాసెన్‌ను ఎంచుకున్నా. స్పిన్‌ను అయినా, పేస్ ను అయినా చాలా చ‌క్క‌గా ఆడాడు. విదేశీ ఆట‌గాళ్ల‌లో ఈ రెండు విభాగాల‌ను చ‌క్క‌గా ఆడే ప్లేయ‌ర్లు అరుదుగా ఉంటారు. కాబ‌ట్టి క్లాసెన్‌ను తీసుకున్నా అని సెహ్వాగ్ వివ‌రించాడు.