Virender Sehwag: ఆన్‌లైన్ అమ్మకాల్లోకి వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్ అమ్మకాల్లోకి వచ్చేసింది. VS బ్రాండ్ స్పోర్ట్స్ వేర్ www.vsshop.comలో అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు ఇక్కడే కాకుండా మరో మూడు నెలల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫాంపై కూడా దొరుకుతాయట.

Virender Sehwag: ఆన్‌లైన్ అమ్మకాల్లోకి వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్

Virender Sehwag

Virender Sehwag: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్ అమ్మకాల్లోకి వచ్చేసింది. VS బ్రాండ్ స్పోర్ట్స్ వేర్ www.vsshop.comలో అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు ఇక్కడే కాకుండా మరో మూడు నెలల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫాంపై కూడా దొరుకుతాయట.

ఆన్‌లైన్‌లో లాంచ్ చేసిన సమయంలో 30 రకాల ప్రొడక్టులు మాత్రమే ఉంచారు. (ట్రాక్స్, టీ షర్ట్స్, జాకెట్స్, షార్ట్స్)లతో పాటు క్రికెట్ ఎక్విప్మెంట్ (బ్యాట్స్, గ్లౌజులు, ప్యాడ్స్)కూడా దొరకనున్నాయి. కలెక్షన్ లోని ప్రతీది సాలిడ్ కలర్స్ లోనే ఉంటుందట. బ్రాండ్ ఫౌండర్ సింప్లిసిటీని రిప్రజెంట్ చేసే విధంగా ఇలా డిజైన్ చేశారు. ప్రతి స్టైల్ ఆరు రంగుల్లో కంపాక్ట్ కాటన్ తో అందుబాటులో ఉంటుంది.

ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ను అహ్మదాబాద్ లో మార్చి 2020లోనే లాంచ్ చేశారు. వీరూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బ్రాండ్ వీఎస్ ను నిర్వహిస్తుంది. వరల్డ్ వీరూ ప్రైవేట్ లిమిటెడ్, స్టిచెడ్ టెక్స్‌టైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మార్కెట్లో ఇప్పటికే ఉన్న ప్లేయర్లకు వ్యత్యాసం చూపిస్తూ.. రూ.499 నుంచి రూ.1099 మధ్యలోనే అమ్మకాలు జరపుతుంది VS బ్రాండ్. సెహ్వాగ్ అభిమానుల దృష్ట్యా ముందుగా అమ్మకాలు జరుగుతాయని భావించి హిందీ మాట్లాడే ఏరియా మార్కెట్లనే ఫోకస్ పెట్టారు.

‘ఇండియాలో మంచి క్వాలిటీ అథ్లెట్ దుస్తులు కాస్ట్లీగానే ఉంటున్నాయి. మిలియన్ల కొద్దీ కస్టమర్లు క్వాలిటీ లేదంటే.. ధర ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు. అందుకే VS by Sehwag వచ్చింది. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ లను నిజాయతీగా ఉత్తమమైన ధరలకే అందిస్తుంది. ధరకు తగ్గ విలువ ఇవ్వకుండా కస్టమర్లకు అంటగట్టాలని అనుకోవడం లేదని’ సెహ్వాగ్ అన్నారు.

ఈ బ్రాండ్ ఆన్-లైన్, ఈ కామర్స్ ప్లాట్ ఫాంలపై 2026నాటికి 50లక్షల కస్టమర్లను సంపాదించాలనేది టార్గెట్. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది వస్తువులను ఆన్ లైన్లోనే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సమానంగా ఆఫ్ లైన్ విస్తరణ కూడా ముఖ్యమే. అహ్మదాబాద్ లో మరో రెండు స్టోర్లు ఓపెన్ చేయగా.. గుజరాత్ లోని వడోదరాలో, మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో, ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో కొత్తగా స్టోర్లు ఓపెన్ అయ్యాయి.

అంతేకాకుండా ఢిల్లీ, ఫరీదాబాద్, భోపాల్, ఇండోర్, శ్రీగంగానగర్, కాన్పూర్ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేసుకున్నారు.