రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

పంజాబ్ నుంచి ఆడి సత్తా చాటిన వీఆర్వీ సింగ్.. అన్ని క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు ప్రకటించాడు. 2006లో టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన ఈ క్రికెటర్ వెస్టిండీస్‌తో సెయింట్ జాన్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో 2007లో జరిగిన టెస్టు మ్యాచ్ వరకూ టెస్టు కెరీర్ కొనసాగించాడు. ఫేసర్‌గా 8వికెట్లను పడగొట్టిన వీఆర్వీ సింగ్ కెరీర్ కు వీడ్కోలు చెప్పేశాడు. 
Read Also : త్వరగా కోలుకో: హాస్పిటల్ పాలైన సైనా నెహ్వాల్

ఈ ఫేసర్‌ టీమిండియా తరపున 2 వన్డే మ్యాచ్‌లలోనూ ఆడాడు. 1984 సెప్టెంబర్ 17న పుట్టిన సింగ్.. పంజాబ్ తరపున దేశీవాలీ లీగ్‌లలో ఆడాడు. 2003-04లో లిస్ట్ ఏ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన సింగ్.. 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍‌లలో 31వికెట్లు పడగొట్టాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆడిన సింగ్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి 3 సీజన్లకు ప్రాతినిధ్యం వహించాడు. గాయాల కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఆఖరి దేశీ వాలీ లీగ్ మ్యాచ్‌ను 2014లో ఆడాడు. వడోదరా వేదికగా జరిగిన రంజీ ట్రోఫీలోని క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌యే సింగ్ ఆఖరి మ్యాచ్.