VVS Laxman : ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.. భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ ఆటగాడిపై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు

కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి రెండు అంశాలు అడ్డుపడ్డాయి. ఒకటి వెలుతురు లేమి. రెండోది..

VVS Laxman : ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.. భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ ఆటగాడిపై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు

Vvs Laxman

VVS Laxman : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి రెండు అంశాలు అడ్డుపడ్డాయి. ఒకటి వెలుతురు లేమి. రెండోది న్యూజిలాండ్ కొత్త ఆటగాడు రచిన్ రవీంద్ర. 22ఏళ్ల రచిన్ రవీంద్రకు ఇదే తొలి టెస్టు మ్యాచ్. అయితేనేం భారత స్పిన్ దాడులను ఎదుర్కొని న్యూజిలాండ్ ను ఓటమి నుంచి తప్పించాడు. భారత్ కు విజయాన్ని దూరం చేశాడు.

ఒక్క వికెట్ తీస్తే గెలుపు వశమవుతుందన్న తరుణంలో టీమిండియాకు కొరకరానికొయ్యలా మారాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ భారత సంతతి ఆటగాడు 91 బంతులు ఎదుర్కొని 18 పరుగులే చేసినా, పరిస్థితుల దృష్ట్యా అది సెంచరీతో సమానం. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాన్పూర్ టెస్టును కివీస్ డ్రా చేసుకుందంటే ఆ ఘనత రచిన్ రవీంద్రకే దక్కుతుందని అన్నాడు. ఎంతో క్లిష్టపరిస్థితుల్లో అతడు ప్రదర్శించిన నిబ్బరం, ప్రశాంత స్వభావం కివీస్ ను గట్టెక్కించాయన్నాడు. ఈ కుర్రాడికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

ఏదేమైనా న్యూజిలాండ్ జట్టు టెస్టుల్లో వరల్డ్ చాంపియన్ అన్న సంగతి మరువరాదని, తాము ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించబోమని కివీస్ చాటి చెప్పిందని లక్ష్మణ్ కొనియాడాడు.

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆఖరి రోజు మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి సెషన్ లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 9 వికెట్లు తీశారు. కానీ ఆలౌట్ చేయలేకపోయారు. టీమిండియా ఒక్క వికెట్ తీస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో వెలుతురు లేమి ప్రతిబంధకంగా మారింది. ఓటమి అంచుల్లో నిలిచిన న్యూజిలాండ్ కు అదే వరంలా మారింది. మ్యాచ్ జరిగే వీల్లేకపోవడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు.

Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?

సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ ముగిసే సమయానికి కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. భారత్ రెండు ఇన్నింగ్స్ ల్లో 354, 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది. డిసెంబర్ 3న రెండో టెస్టు ప్రారంభం కానుంది.

చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసుంటే భారత్‌ ఘన విజయం సాధించేదే. అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (23 బంతుల్లో 2 పరుగులు), రచిన్‌ రవీంద్ర (91 బంతుల్లో 18 పరుగులు) జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను
కాపాడుకున్నారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర భారత్ విజయానికి అడ్డుపడ్డాడు. 91 బంతులు ఆడిన రవీంద్ర 18 పరుగులే చేసినా, మరో వికెట్ పడకుండా ఆడి తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. వీరిద్దరి కారణంగా భారత్‌ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది. విజయానికి అతి దగ్గరగా వచ్చిన టీమిండియాకు చివరికి నిరాశే ఎదురైంది.