Waqar Younis : హిందువుల మధ్య పాక్ బ్యాట్స్‌మన్ నమాజ్ నచ్చింది.. మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. అంతమంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం..

Waqar Younis : హిందువుల మధ్య పాక్ బ్యాట్స్‌మన్ నమాజ్ నచ్చింది.. మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Waqar Younis

Waqar Younis : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ క్షమాపణలు కోరాడు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. అంత మంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం తనకు బాగా నచ్చిందని అన్నాడు. అది తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

అంతే.. వకార్ వ్యాఖ్యల అగ్గి రాజేశాయి. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు టీమిండియా మాజీలు మండిపడ్డారు. వారి మాటల్లోని జిహాదీ తత్వం బయటపడిందని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. వకార్ లాంటి గొప్ప ఆటగాడి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి రావడం బాధాకరమని హర్ష భోగ్లే అన్నాడు. పాకిస్తాన్ లోని మంచి క్రీడా ప్రేమికులంతా అతడి మాటల్లోని నిగూఢార్థాన్ని అర్థం చేసుకోవాలన్నాడు.

పరిస్థితి చేయి దాటడంతో వకార్ స్పందించాడు. వెంటనే ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరాడు. ఏదో క్షణికావేశంలో అన్నానే తప్ప తనలో ఏ దురాలోచనా లేదని వివరణ ఇచ్చాడు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని తనకు లేదని చెప్పాడు. ప్రజలందరినీ ఏకం చేసేది కేవలం క్రీడలేనని.. మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదని స్పష్టం చేశాడు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?