Washington Sundar : టీమిండియా క్రికెటర్‌కు కరోనా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు డౌటే..!

ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్

Washington Sundar : టీమిండియా క్రికెటర్‌కు కరోనా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు డౌటే..!

Washington Sundar

Washington Sundar : కరోనావైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు.. అందరిపైనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు. కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కి సుందర్ ఎంపికయ్యాడు. త్వరలో భారత జట్టుతో కలిసి దక్షిణాఫ్రికాకి వెళ్లాల్సి ఉంది. ఇంతలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో జనవరి 19 నుంచి సౌతాఫ్రికాలో జరిగే వన్డే సిరీస్ కు సుందర్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.

Work From Home: కొత్త ఆంక్షలు.. ఆఫీసులు మూసివేత.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌!

సఫారీతో వన్డే సిరీస్‌కి ఎంపికైన భారత క్రికెట్ సభ్యులందరూ ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం సౌతాఫ్రికా చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే సుందర్ కి కరోనా నిర్ధారణ కావడం జట్టులో కలకలం రేపింది. ఇంగ్లాండ్‌ టూర్‌లో కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్, దాదాపు 10 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తమిళనాడు తరుపున విజయ్ హజారే ట్రోఫీ 2021లో పాల్గొన్నాడు.

TATA IPL: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు

విజయ్ హజారే ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ కనబర్చిన ప్రదర్శనతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే అతనిప్పుడు కరోనా బారిన పడటంతో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లడం సందేహంగా మారింది. వాషింగ్టన్ సుందర్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, చాహల్ మరో ఇద్దరు స్పిన్నర్లకు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ జట్టులో అవకాశం దక్కింది. అయితే అశ్విన్, చాహల్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ తో పాటు బ్యాటుతోనూ ఉపయోగపడతాడు. సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా.

Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా-భారత్ మధ్య జనవరి 19న మొదటి వన్డే, జనవరి 21న రెండో వన్డే జరగనున్నాయి. మూడో టెస్టు జరుగుతున్న కేప్‌ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జనవరి 23న ఆఖరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. సౌతాఫ్రికా టూర్ కి ముందు సుందర్ కరోనా బారిన పడటం భారత జట్టుకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.