T20 World Cup-2022: కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అదరహో అనిపించిన న్యూజిలాండ్ ఆటగాడు

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరేలా పట్టిన క్యాచ్ అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

T20 World Cup-2022: కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అదరహో అనిపించిన న్యూజిలాండ్ ఆటగాడు

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరేలా పట్టిన క్యాచ్ అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా 50 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన అనంతరం ఫిలిప్స్ ఈ క్యాచ్ పట్టాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ మార్కస్ స్టోయినిస్ న్యూజిలాండ్ బౌలర్ శాంట్నర్ బౌలింగ్ లో భారీ షాటుకు ప్రయత్నించగా బంతి బౌండరీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో 7 పరుగుల వ్యక్తిగత స్కోరుకే మార్కస్ స్టోయినిస్ వెనుదిగిగాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఏ మాత్రమూ రాణించలేకపోతున్నారు. ఎటువంటి  అంచనాలూ లేకుండా టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో అదరగొట్టేసింది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..