Bangladesh vs India: మైదానంలో ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లపై కోహ్లీ ఆగ్రహం.. వీడియో

Bangladesh vs India: మైదానంలో ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లపై భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి మూడో రోజు ఆటలో మెహిదీ హసన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ.. మోమినల్ హక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 22 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
అతడు ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లు సంబరంలో మునిగిపోయి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. మైదానంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, తైజుల్ ఇస్లాం పరస్పరం స్వల్ప వాగ్వివాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా, నేటి మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్ల హవా కొనసాగింది. బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. భారత్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
Angry pic.twitter.com/2VuYLtxyqD
— Adnan Ansari (@AdnanAn71861809) December 24, 2022
NEP 2020: జాతీయ నూతన విద్యా విధానం అందుకే తెచ్చాం.. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ