Bangladesh vs India: క్యాచులు వదిలేసి అసహనం తెప్పించిన కోహ్లీ.. వీడియో వైరల్
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు తావిస్తోంది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ పలు క్యాచులు వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోహ్లీ క్యాచులు వదిలేయడంతో కీలక వికెట్లు తీసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు తావిస్తోంది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ పలు క్యాచులు వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోహ్లీ క్యాచులు వదిలేయడంతో కీలక వికెట్లు తీసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
కోహ్లీ పదే పదే క్యాచులు వదిలేయడం అభిమానుల్లో అసహనం తెప్పించింది. కోహ్లీ నాలుగు క్యాచులు వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉన్న అత్యత్తుమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఇన్ని క్యాచులు వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోహ్లీ స్లిప్ లో ఉన్న సమయంలో లిట్టన్ దాస్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆ సమయంలో లిట్టన్ దాస్ బ్యాట్ కు బంతి తగిలి నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో క్యాచ్ మిస్ చేశాడు కోహ్లీ. అదే ఓవర్లో మరో క్యాచును కూడా కోహ్లీ మిస్ చేశాడు. అనంతరం కూడా అదే రీతిలో క్యాచులు మిస్ చేశాడు. కోహ్లీ సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే బంగ్లాదేశ్ ను మరింత తక్కువ స్కోరుకే ఇండియా కట్టడి చేసి ఉండేది.
Virat Kohli is dropping catches in Slip. He dropped 4 of it today. #ViratKohli #Kohli #BANvsIND #INDvsBAN
Courtesy: SONY SPORTS pic.twitter.com/XKbad9n7MI
— Zee 24Tas (@zee24tasin) December 24, 2022