Rahul Dravid: ఏదీ ప్రత్యేకం కాదు.. అన్నీ ముఖ్యమే – రాహుల్ ద్రవిడ్

టీమిండియాకు కొత్తగా నియమితులైన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక కామెంట్ చేశారు. మాకు ఏ ఫార్మాట్ ప్రత్యేకమైనది కాదని అంటున్నారు. న్యూజిలాండ్ జట్టుతో సొంతగడ్డపై తలపడే టీ20 సిరీస్ తో....

Rahul Dravid: ఏదీ ప్రత్యేకం కాదు.. అన్నీ ముఖ్యమే – రాహుల్ ద్రవిడ్

Rahul Dravid

Rahul Dravid: టీమిండియాకు కొత్తగా నియమితులైన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక కామెంట్ చేశారు. మాకు ఏ ఫార్మాట్ ప్రత్యేకమైనది కాదని అంటున్నారు. న్యూజిలాండ్ జట్టుతో సొంతగడ్డపై తలపడే టీ20 సిరీస్ తో మొదలుకానుంది. టీమ్ ప్రిపరేషన్స్ పై గురించి కూడా ద్రవిడ్ స్పందించాడు.

న్యూజిలాండ్ తో ఇండియా 3టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ లు నవంబర్ 17 నుంచి ఆడనుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ కు ఇదే తొలి సిరీస్. ఈ క్రమంలోనే ఏ ఫార్మాట్ కు ప్రియారిటీ ఇస్తారనే ప్రశ్నకు సమధానమిచ్చారు.

‘ఏ ఫార్మాట్ ను ప్రత్యేకమైనదిగా చూడటం లేదు. అన్నీ ఫార్మాట్లు ముఖ్యమే. దేనికైనా ఎలా ప్రిపేర్ అయ్యామనేదే ఇంపార్టెంట్.. మూడు ఐసీసీ ఈవెంట్లకు ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్లేయర్స్ గా.. బెటర్ అవ్వాలనుకుంటున్నాం’ అని వర్చువల్ కాన్ఫిరెన్స్ ద్వారా తెలియజేశాడు.

……………………………………………… : లంచాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించిన సీఎంకి షాకింగ్ రిప్లై

న్యూజిలాండ్ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. రీసెంట్ టోర్నమెంట్లోనూ ఇండియాను ఓడించారు. ఇప్పుడు దొరికిన మరో అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి’ అని ద్రవిడ్ అన్నారు.