Gautham Gambhir: పోలీసుల్లోనే ఐసిస్ గూఢచారులున్నారు – గౌతం గంభీర్

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి మూడో సారి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతంలో రెండు మార్లు ఇలాగే రావడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి సహాయం కావాలని అడిగాడు.

10TV Telugu News

Gautham Gambhir: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి మూడో సారి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతంలో రెండు మార్లు ఇలాగే రావడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి సహాయం కావాలని అడిగాడు. వాళ్లు పట్టించుకోవడం లేదని పోలీసుల్లోనే ఐసిస్ గూఢచారులున్నారంటూ ఆరోపించాడు ఈ మాజీ క్రికెటర్.

‘మీ ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ శ్వేత సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నారు. పోలీసుల్లోనే వారికి గూఢచారులున్నారు. మీ గురించి సమాచారం తెలుసుకుంటున్నాం’ అంటూ ఈమెయిల్ చేసిన వారిని సంభోధిస్తూ అన్నారు. డీసీపీ సెంట్రల్ శ్వేత చౌహన్.. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. బెదిరింపు మెయిల్స్ గురించి వివరించారు.

isiskashmir@yahoo.com అనే ఈమెయిల్ నుంచి నవంబర్ 28న శనివారం మధ్యాహ్నం ఒంటి గంట 37నిమిషాలకు ఈ-మెయిల్ వచ్చింది. ఇది మూడో బెదిరింపు మెయిల్. గత వారం ఐసిస్ కశ్మీర్ ను పేర్కొంటూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయంటూ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ సమయంలో తనకు isiskashmir@gmail.com నుంచి మెయిల్ వచ్చినట్లు పేర్కొన్నాడు.

…………………………………….: సైకిల్‌పై పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వెళ్లిన ఎంపీ

ఈ-మెయిల్ ఐడీ isiskashmir@gmail.com నుంచి తనకు అందిన మెయిల్ లో.. ‘మేం నిన్ను చంపేయాలని ప్లాన్ చేశాం. కానీ, నిన్న నువ్వు బతికిపోయావ్. కుటుంబంతో కలసి గడపాలనుకుంటే రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉండు’ అని అందులో ఉంది.

సెకండ్ ఈమెయిల్ లో ఢిల్లీలోని గౌతం గంభీర్ ఇంటి బయటి వాతావరణం అంతా షూట్ చేసిన వీడియో పంపారు. ఐసిస్ కశ్మీర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తొలి మెయిల్ లో నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారంటూ ఫిర్యాదు చేశాడు. ఎంపీ పర్సనల్ సెక్రటరీ గౌరవ్ అరోరా తెలిపిన వివరాలను బట్టి ఎఫ్ఐఆర్ లో రిజిష్టర్ చేశారు.

……………………………….. : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…

×