Bangladesh vs India: మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు: రేపటి మ్యాచుపై శిఖర్ ధావన్

‘సిరీస్ లోని తొలి మ్యాచులో టీమిండియా ఓడిపోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆడిన సిరీస్ లలో తొలి మ్యాచులో ఓడి తర్వాత రాణించాం. ఇది సాధారణమే.. మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఆటలో ఎక్కడ మెరుగుపడాలన్న విషయంపై మేము విశ్లేషించుకున్నాము. రానున్న మ్యాచుల్లో ప్రభావవంతంగా ఆడతాం. ఈ విషయంలో మేము సానుకూల దృక్పథంతో ఉన్నాం. రానున్న మ్యాచుల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని శిఖర్ ధావన్ చెప్పాడు.

Bangladesh vs India: మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు: రేపటి మ్యాచుపై శిఖర్ ధావన్

Shikar Dhavan

Bangladesh vs India: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచులో ఓడిన టీమిండియా రేపు రెండో మ్యాచులో తలపడనుంది. తొలి మ్యాచులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలం కావడంతో రేపటి మ్యాచులో భారత బ్యాటింగ్ ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి మ్యాచులో టీమిండియా ఓడిపోతే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంటుంది.

దీనిపై శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ తాము తిరిగి పుంజుకుంటామని చెప్పాడు. ‘‘సిరీస్ లోని తొలి మ్యాచులో టీమిండియా ఓడిపోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆడిన సిరీస్ లలో తొలి మ్యాచులో ఓడి తర్వాత రాణించాం. ఇది సాధారణమే.. మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఆటలో ఎక్కడ మెరుగుపడాలన్న విషయంపై మేము విశ్లేషించుకున్నాము. రానున్న మ్యాచుల్లో ప్రభావవంతంగా ఆడతాం. ఈ విషయంలో మేము సానుకూల దృక్పథంతో ఉన్నాం. రానున్న మ్యాచుల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని శిఖర్ ధావన్ చెప్పాడు.

కాగా, ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ తోనూ తొలి మ్యాచులో ఓడిపోవడంతో మిగతా రెండు మ్యాచుల్లో గెలుపుకోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను టీమిండియా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడింది. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్