Srinivas goud on tickets issue: ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

టికెట్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బేగంపేట మహిళా కానిస్టేబుల్ నవీనా ఇద్దరి ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు. జింఖానా మైదానంలో తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన రంజితా అనే యువతికి సీపీఆర్ చేసి నవీనా కాపాడిందని వివరించారు. ఆమెకు పదోన్నతి ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ప్రతిపాదిస్తూ లేఖ రాశానని చెప్పారు.

Srinivas goud on tickets issue: ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas goud on tickets issue: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని అన్నారు. సికింద్రాబాద్​ జింఖానా మైదానంలో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది బాధితులతో కలిసి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడడానికి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గాయపడ్డ బాధితులకు, పోలీసులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

టికెట్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బేగంపేట మహిళా కానిస్టేబుల్ నవీనా ఇద్దరి ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు.

జింఖానా మైదానంలో తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన రంజితా అనే యువతికి సీపీఆర్ చేసి నవీనా కాపాడిందని వివరించారు. ఆమెకు పదోన్నతి ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ప్రతిపాదిస్తూ లేఖ రాశానని చెప్పారు. అలాగే, మరో కానిస్టేబుల్ విమలకు నగదు బహుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

కాగా, ఉప్పల్ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్దకు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురికి తీవ్రగాయాలయ్యాయి. హెచ్​సీఏ బ్లాక్​లో టిక్కెట్లను అమ్ముతోందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, తమ తప్పు ఏమీ లేదని హెచ్​సీఏ చెప్పుకొస్తోంది.

Hyderabad T20 Match Betting : కాయ్ రాజా కాయ్.. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు