వెల్లింగ్టన్ టీ20: న్యూజిలాండ్ పై భారత్ సూపర్ విజయం

  • Edited By: veegamteam , January 31, 2020 / 11:08 AM IST
వెల్లింగ్టన్ టీ20: న్యూజిలాండ్ పై భారత్ సూపర్ విజయం

సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 14 పరుగులను టీమిండియా చేజ్ చేసింది. నాలుగో టీ20 మ్యాచ్ కూడా టై కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్.. 7 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది.

సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. కివీస్ విధించిన 14 పరుగుల టార్గెట్ ను భారత్ చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ చేధించింది. సూపర్ ఓవర్ లో భారత్ స్కోర్ 16/1. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత జట్టుకి ఇది వరుసగా నాలుగో విజయం. కాగా, మరోసారి సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ కు ఓటమి ఎదురైంది. సూపర్ ఓవర్ న్యూజిలాండ్ కు కలిసి రావడం లేదు. 6 బంతులు న్యూజిలాండ్ ను ఆగం చేశాయ్.

న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ(Southee) సూపర్ ఓవర్ వేశాడు. తొలి బంతిని సిక్సర్ బాదాడు కేఎల్ రాహుల్. రెండో బంతికి ఫోర్ కొట్టాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 3వ బంతికి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టుని గెలిపించాడు. 4వ బంతికి 2 రన్స్ తీసిన కోహ్లి.. 5వ బంతికి ఫోర్ కొట్టాడు. దీంతో మరో బంతి ఉండగానే.. టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది.

* వెల్లింగ్టన్ టీ20 లో భారత్ సూపర్ విజయం
* మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తో తేలిన ఫలితం
* సూపర్ ఓవర్ లో భారత్ ఘన విజయం
* సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ స్కోర్ 13/1
* సూపర్ ఓవర్ లో టీమిండియా స్కోర్ 16/1

* 5 టీ20ల సిరీస్ లో కోహ్లి(Virat Kohli) సేనకు వరుసగా 4వ విజయం
* న్యూజిలాండ్ కు కలిసిరాని సూపర్ ఓవర్
* తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ – 165/8
* న్యూజిలాండ్ స్కోర్ – 165/7

Also Read : క్రికెట్ ఫ్యాన్స్‌లో భయంకరమైన ఒత్తిడి