ధోనీని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం: ఎమ్మెస్కే

ధోనీని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం: ఎమ్మెస్కే

దక్షిణాఫ్రికాతో దిగ్విజయంగా టెస్టు సిరీస్ విజయం దక్కించుకున్న భారత్.. కొద్ది రోజుల విరామంతోనే బంగ్లాదేశ్ తో తలపడనుంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీ20ఫార్మాట్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందులోనూ ధోనీకి చోటు దక్కలేదు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా అధికారం తీసుకున్న తర్వాత ధోనీకి జట్టులో స్థానంపై క్లారిటీ ఇస్తానన్న గంగూలీ.. జట్టులో ధోనీకి స్థానం లేకుండా చేశారా అనే అనుమానాలు తలెత్తాయి. 

ఈ మేర టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘ధోనీ రిటైర్మెంట్ ఇస్తే వికెట్ కీపర్ కు ప్రత్యామ్న్యాయం లేదు. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ప్రోత్సహిస్తున్నాం. అతనిపైనే మా ఫోకస్ పెట్టాం. ఈ విషయంపై ధోనీని సంప్రదించాం. యువ క్రికెటర్లను ప్రోత్సహించాలని ధోనీ కూడా వెనక్కితగ్గాడు’

‘వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మేం క్లియర్ గానే ఉన్నాం. రిషబ్ పంత్ రాణించలేకపోవచ్చు కానీ, మా వైపు నుంచి అవకాశాలు ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. త్వరలో పంత్ పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ ముగించారు. 

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటన అనంతరం భారత జట్టుతో చేరేలోపే గాయం కారణంగా మరోసారి విరామాన్ని పొడిగించాడు. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దూరం కానున్నాడు.