IND vs SL 1st T20: ఉత్కఠభరిత పోరులో విజయం తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?

ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగగా.. రెండు పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై భారత్ విజయం సాధించింది. విజయం తరువాత ఇండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడారు.

IND vs SL 1st T20: ఉత్కఠభరిత పోరులో విజయం తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?

Hardik Pandya

IND vs SL 1st T20: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బాల్ వరకు నరాలుతెగే ఉత్కంఠ కొనసాగగా.. టీమ్ ఇండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులతో బ్యాటర్‌కు సిక్స్, ఫోర్లు కొట్టేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్ విజయం సాధించింది.

Ind Vs SL : వాటే మ్యాచ్.. తొలి టీ20లో శ్రీలంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

చివరి బాల్‌కు భారత్ జట్టు విజయం సాధించిన అనంతరం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడారు. మీరు చివరి ఓవర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించగా.. అవును ఇప్పుడు నేను కెప్టెన్‌గా పిలవడానికి అలవాటు పడ్డాను అంటూ చమత్కరించారు. ఇది కేవలం తిమ్మిరి. ప్రస్తుతం నేను క్రీడాభిమానులను భయపెట్టే ధోరణిని కలిగి ఉన్నాను. కానీ, నేను నవ్వుతూ ఉంటే పైకి బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు నిద్ర సరిగా పట్టలేదు, సరిపడా నీళ్లు తాగలేదు, అందుకే గ్లుట్స్ (ఒక ప్రత్యేక రకం కండరాలు) గట్టిగా ఉన్నాయి. నేను అస్వస్థతకు గురయ్యాను. నా ద్రవాలు తగ్గాయి అని హార్దిక్ అన్నారు. అక్షర్ పటేల్‌తోనే చివరి ఓవర్ ఎందుకు వేయించారని ప్రశ్నించగా.. శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే ఆ సమయంలో అక్షర పటేల్ అయితే సరియైన బౌలర్ అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే యువ ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించారని హార్దిక్ అన్నారు.

India vs Sri Lanka: శ్రీలంకకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

శివమ్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో మావి అద్భుతంగా బౌలింగ్ వేయడం చూశాను. అతని బలం ఏమిటో నాకు తెలుసు. అరంగ్రేటంలోనే అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవటం ఆనందంకలిగించింది. కీలకమైన నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో శివమ్ మావి కీలక భూమిక పోషించారంటూ హార్డిక్ పాండ్యా కొనియాడారు.