T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా స్థానం ఆ ఇద్దరిలో ఎవరికి.. ద్రవిడ్, రోహిత్ శర్మలు ఏమన్నారంటే.?
టీ20 వరల్డ్ కప్‌లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.

T20 World cup
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సమయం దగ్గరపడుతున్న వేళ భారత్ జట్టు ఆటగాళ్లను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా వెన్నునొప్పి కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే బుమ్రా స్థానంలో ఎవరిని తుదిజట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో బుమ్రా స్థానంలో ఎవరిని టీ20 వరల్డ్ కప్ లో ఆడిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ద్రవిడ్ పలు విషయాలను ప్రస్తావించాడు.
T20 World Cup-2022: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు బుమ్రా దూరం
బుమ్రా లేకపోవటం జట్టుకు పెద్దనష్టమే, అతను గొప్ప ఆటగాడు, కానీ అనుకోని పరిస్థితుల్లో అతను టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అన్నాడు. బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు. షమీ కొవిడ్ కారణంగా ప్రస్తుత సిరీస్ ఆడలేకపోయాడు. కానీ అతను జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని ద్రవిడ్ చెప్పాడు. 14 నుంచి 15 రోజుల కొవిడ్ తర్వాత అతని స్థితి ఏమిటి, ధాని గురించి నివేదికలు వచ్చిన తరువాత షమీ ఎంపికపై ఆలోచిస్తామని ద్రవిడ్ అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా.. బుమ్రా స్థానంలో ఎవరు అన్నదానిపై ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అయితే, ప్రస్తుతం జట్టులో ఉన్నవారిలో కొందరికే ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న బౌలర్‌ను తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాం. ఆ బౌలర్ ఎవరో ఖచ్చితంగా నాకు తెలియదు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తరువాత ఈ విషయంపై ఆలోచిస్తామని రోహిత్ అన్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకంటే ముందు అక్టోబర్ 17, 19 తేదీల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో రెండు వామప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతాయి.