SRH : జట్టు నుంచి తప్పించింది ఎవరు ?

2021 ఐపీఎల్ (IPL) తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని ప్రశ్నించాడు. అయితే..దీనికి ఆ వ్యక్తి పేరు చెప్పకుండా..ఫన్నీ ఎమోజీలతో బదులివ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

10TV Telugu News

David Warner : ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చెప్పనవసరం లేదు. క్రికెటర్ గానే కాకుండా..ఫన్నీ ఫన్నీ వీడియోస్ తీస్తూ…అందరి నోళ్లలో నానుతున్నారు. పలు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగ్‌లు చెబుతూ.. స్పూఫ్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరించారు. అయితే..2021 ఐపీఎల్ (IPL) తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని ప్రశ్నించాడు. అయితే..దీనికి ఆ వ్యక్తి పేరు చెప్పకుండా..ఫన్నీ ఎమోజీలతో బదులివ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచెజీకి ఈయనకు విడదీయరాని అనుబంధం ఉంది. 2016లో హైదరాబాద్ జట్టుకు IPL టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. మూడు సీజన్ల నుంచి సన్ రైజర్స్ బ్యాటింగ్ లో డేవిడ్ కీలక పాత్ర పోషించారు. అయితే…2021 ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా జట్టుకు దూరమయ్యారు. విజయాలకు చేరువగా వచ్చిన ఈ జట్టు ఓటమి పాలైంది. 2016 నుంచి 2020 వరకు ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది ఈ జట్టు. 2021 సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…రెండో దశ ఐపీఎల్ ను యూఏఈ వేదికకు మార్చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.

×