IPL 2023: చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ సందర్భంగా టీవీ స్కోర్ బోర్డులో చెట్టు బొమ్మలు ఎందుకొచ్చాయో తెలుసా..?

బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు

IPL 2023: చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ సందర్భంగా టీవీ స్కోర్ బోర్డులో చెట్టు బొమ్మలు ఎందుకొచ్చాయో తెలుసా..?

dot ball symbols

CSK Vs GT: ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరింది. లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యి.. ప్లే ఆఫ్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోనీ సేన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో సీఎస్‌కే జట్టు పదోసారి ఫైనల్ కు చేరినట్లయింది. అయితే, ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఫైనల్ మ్యాచ్ లలో నాలుగు సార్లు విజయం సాధించి విజేతగా నిలవగా, ఐదు సార్లు ఓటమితో రన్నరప్‌గా నిలిచింది.

IPL 2023: కోహ్లీని మరోసారి టార్గెట్ చేసిన నవీన్ ఉల్‌హుక్!.. ఆర్సీబీ ఓటమి తరువాత వీడియో షేర్ చేసిన లక్నో ప్లేయర్

ఇదిలాఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న క్రమంలో టీవీ స్కోర్ బోర్డుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ సందర్భంగా బౌలర్ డాట్ బాల్ వేస్తే మామూలుగా అయితే స్కోర్ బోర్డులో జీరో పడుతుంది. కానీ జీరో స్థానంలో చెట్టు గుర్తు కనిపిస్తుంది. దీంతో చెట్టుగుర్తు ఎందుకు పడుతుందా అని క్రికెట్ అభిమానుల్లో ప్రశ్న వ్యక్తమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఉందట. ఓ మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీసీఐ ఇలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్‌తో ఉమ్రాన్ మాలిక్ గొడ‌వ ప‌డ్డాడా..? అందుకే తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం లేదా..?

బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో డాట్ బాల్‌కు 500 చొప్పున మొక్కలు నాటేందుకు బీసీసీఐ నిర్ణయిచింది. బీసీసీఐ తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకూ వర్తిస్తుంది. తొలి క్వాలిఫయర్ చెన్నై ఇన్నింగ్స్ లో 34 డాట్ బాల్స్, గుజరాత్ ఇన్నింగ్స్ లో 50 డాట్ బాల్స్ ఉన్నాయి. దీంతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ మొత్తంలో బీసీసీఐ 42,000 మొక్కలు నాటబోతుందనమాట.