IPL 2023: ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిఉంటే రోహిత్ సేన విజయం సాధించేదా? అసలు ఇషాన్‌కు ఏమైంది..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇషాన్ కిషన్ ముంబై జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్‌గా రోహిత్ భారీ స్కోర్ సాధించలేక పోయినా.. మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఇషాన్ తొలి ఓవర్లలో పరుగులు రాబడుతూ వచ్చాడు.

IPL 2023: ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిఉంటే రోహిత్ సేన విజయం సాధించేదా? అసలు ఇషాన్‌కు ఏమైంది..

Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే‌ను గుజరాత్ జట్టు ఢీకొట్టనుంది. కీల‌క పోరులో గుజ‌రాత్ టైటాన్స్ అద‌ర‌గొట్టింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. త‌ద్వారా హార్దిక్ సేన వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైన‌ల్స్‌కు దూసుకువెళ్లింది.

Shubman Gill: శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఈ సీజ‌న్‌లో మూడోది.. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే

ముంబైను దెబ్బకొట్టిన గిల్..

క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభంలో గిల్ నెమ్మదిగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ క్రమంలో గిల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ముంబై ప్లేయర్లు నేలపాలు చేశారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 233 పరుగులు చేసింది.

IPL2023: ముంబై చిత్తు.. ఫైన‌ల్‌కు హార్ధిక్ సేన‌.. చెన్నైతో ఢీ కొట్ట‌నున్న గుజ‌రాత్

ఇషాన్ ఉండిఉంటే ..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇషాన్ కిషన్ ముంబై జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ భారీ స్కోర్ సాధించలేక పోయినా.. మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఇషాన్ తొలి ఓవర్లలో పరుగులు రాబడుతూ వచ్చాడు. శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌ నేహాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే అతను కేవలం నాలుగు పరుగులకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చిఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదని, విజయావకాశాలు ఎక్కువగా ఉండేవని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

TDP Mahanadu 2023: టీడీపీ మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ.. కార్యక్రమాల షెడ్యూల్ ఇలా..

ఇషాన్ ఎందుకు బ్యాటింగ్‌కు రాలేదు..

ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో మైదానంను వీడాల్సి వచ్చింది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో 16వ ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత జోర్దాన్ తన టోపీ సర్దుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఇషాన్ ఎడమ కంటికి జోర్ధాన్ మోచేయి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్.. వెంటనే మైదానం వీడాడు. అతని స్థానంలో విష్ణు వినోద్ కంకషన్ సబ్ స్టిట్యూట్‌గా ఆడాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. తనకు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఇషాన్ కిషన్‌ బ్యాటింగ్‌కు రాలేకపోయినట్లు తెలిసింది.