T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ – పాక్ జట్లు మరోసారి తలపడనున్నాయా..? అలా జరిగితే సాధ్యమే ..
టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి పాక్ వర్సెస్ ఇండియా జట్లు తలపడితే బాగుండు అని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే వారి కోరిక తీరే అవకాశాలు లేకపోలేదు. కానీ, ఇరు జట్లు టోర్నీలో చివరి వరకు నిలవాలి. అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మనం మరోసారి అద్భుత మ్యాచ్ చూసే అవకాశం లభిస్తుంది.

Pakistan vs India match
T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టేడియంలో ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇండియా అద్భుత విజయం సాధించింది. ప్రారంభం నుంచి పాక్‌చేతిలో ఉన్న మ్యాచ్ చివరి నాలుగు ఓవర్లలో విరాట్ కోహ్లీ మాయాజాలంతో భారత్ చేతుల్లోకి వచ్చింది. భారత్‌లోని క్రికెట్ అభిమానులేకాదు, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆదివారం జరిగిన పాక్ – ఇండియా మ్యాచ్‌ను ఊపిరిబిగబట్టి చూశారంటే అతిశయోక్తి కాదు.
ఈ మ్యాచ్ ఇచ్చిన కిక్‌తో.. టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి ఇరుజట్లు తలపడితే బాగుండు అని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే వారి కోరిక తీరే అవకాశాలు లేకపోలేదు. కానీ పాకిస్థాన్, ఇండియా జట్లు టోర్నీలో చివరి వరకు నిలవాలి. అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మనం మరోసారి అద్భుత మ్యాచ్ చూసే అవకాశం లభిస్తుంది.
India vs Pakistan T20 Match: పాక్‌పై విజయంతో రికార్డుల మోతమోగించిన టీమిండియా.. అవేమిటో తెలుసా!
ప్రస్తుతం సూపర్-12 దశలో మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ జట్లు గ్రూప్‌లోని మిగిలిన జట్లైన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లపై విజయం సాధించాలి. అలాజరిగి ఇరు జట్లు సెమీస్‌కు వెళితే.. మరో గ్రూప్ నుంచి సెమిస్‌కు వచ్చిన ఇరు జట్లతో పాక్, భారత్ జట్లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లలోసైతం ఇరుజట్లు తమతమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇలా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 13న మళ్లీ మెల్‌బోర్న్ స్టేడియంలోనే ఇరు జట్ల మధ్య రసవత్తర మ్యాచ్‌చూసే అవకాశం లభిస్తుంది.